CM Chandrababu:ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నాం
ABN, Publish Date - Sep 01 , 2024 | 10:03 PM
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వాన పడుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందారు. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వాన పడుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందారు. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సంబంధింత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు సీఎం కీలక సూచనలు, సలహాలు ఇస్తూ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. సింగ్‌నగర్ వరద బాధితుల కష్టాలను స్వయంగా చూశానని సీఎం చంద్రబాబు అన్నారు.
మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించామని తెలిపారు. రాత్రి కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తామని చెప్పారు. వరద నీరు రేపు కూడా రావొచ్చు.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరద బాధితుల్లో నమ్మకం కలిగించి అన్నీ సరిచేశాకే ఇంటికెళ్తానని స్పష్టం చేశారు. 9.72 లక్షల క్యూసెక్కుల వరద రావడం ఇదే తొలిసారి అని తెలిపారు. వరద నీరు తగ్గే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కృష్ణలంక, ఇబ్రహీంపట్నం ప్రాంతాలకు వరద రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఇప్పటికే చేపడుతున్నామని తెలిపారు. సింగ్‌నగర్‌లో బాధితులను కలిశానని అన్నారు.
బుడమేరుకు గండి పడి వరద పోటెత్తిందని అన్నారు. 1998 తర్వాత అదే స్థాయిలో భారీ వర్షాలు పడ్డాయని చెప్పారు. వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు.శ్రీశైలం, సాగర్, పులిచింతల నుంచి భారీగా వరద.. మున్నేరు, బుడమేరు నుంచి భారీగా వరద వస్తోందన్నారు. బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన వరద విజయవాడకు వచ్చిందని చెప్పారు. సుమారు 2.5 లక్షల మంది వరద బాధితులు ఉన్నారని తెలిపారు. బుడమేరు నిర్వహణను గత వైసీపీ ప్రభుత్వం.. ఐదేళ్ల పాటు పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీకి 10 NDRF బృందాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రానికి 40 పవర్ బోట్లు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం 6 హెలికాప్టర్లు పంపిస్తోందని సీఎం చంద్రబాబు వివరించారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు అందించాలని ఆదేశించామని అన్నారు. వరద నీరు తగ్గే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటావమన్నారు. కృష్ణలంక, ఇబ్రహీంపట్నం ప్రాంతాలకు వరద రాకుండా చర్యలు చేపట్టినల్లు తెలిపారు. బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Updated Date - Sep 01 , 2024 | 10:07 PM