ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP politics: సీఎస్‌గా జవహర్ రెడ్డి ఉంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగదు: దేవినేని ఉమా

ABN, Publish Date - May 28 , 2024 | 09:12 PM

ఆంధ్రప్రదేశ్ సీఎస్ జహవర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎస్‌గా జవహర్ రెడ్డి ఉంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగదని, వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలన్నారు. సీఎస్, అతని కుమారుడు భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి భూదందాలను సాక్షాధారాలతో సహా బయటపెట్టామన్నారు. సీఎస్‌గా ఉండే అర్హత ఆయన కోల్పోయారని మండిపడ్డారు.

Devineni Uma

Devineni Uma: ఆంధ్రప్రదేశ్ సీఎస్ జహవర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) హాట్ కామెంట్స్ చేశారు. సీఎస్‌గా జవహర్ రెడ్డి(CS Jahawar Reddy) ఉంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగదని, వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలన్నారు. సీఎస్, అతని కుమారుడు భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి భూదందాలను సాక్షాధారాలతో సహా బయటపెట్టామన్నారు. సీఎస్‌గా ఉండే అర్హత ఆయన కోల్పోయారని మండిపడ్డారు. జూన్ 5న పెట్టాల్సిన ప్రెస్ మీట్ సజ్జల ఇవాళ పెట్టి బోరున విలపిస్తున్నారు. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నామని సజ్జల అనడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నేతల్లా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని, వాస్తవాలే ప్రజలకు చెప్తున్నామని దేవినేని అన్నారు.


సజ్జలకు దేవినేని సూటి ప్రశ్నలు..

15రోజులుగా మాచర్లలో ఏం జరుగుతుందని సజ్జల అంటున్నారు.. మరి ఐదేళ్లుగా మాచర్లలో ఏం జరిగింది?. రూ.2లక్షలు కూడా లేని పిన్నెల్లి ఇవాళ రెండు వేల కోట్లు ఎలా సంపాదించారని దేవినేని ప్రశ్నించారు. మాచర్లలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను కనీసం నామినేషన్ వేయకుండా దాడులు చేసింది ఎవరని దుయ్యబట్టారు. ఈవీఎం ఎందుకు ధ్వంసం చేశావని పిన్నెల్లిని సజ్జల అడగకుండా వీడియో ఎలా బయటికి వచ్చిందని ఈసీని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాని భ్రష్టు పట్టించింది సజ్జల కుమారుడు కాదా? అంటూ ధ్వజమెత్తారు. మరో నాలుగు రోజుల్లో వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారంటూ సజ్జల పగటి కలలు కనడం మానుకోవాలని, వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా అన్ని వర్గాల ప్రజల మద్దతుతో కూటమి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

NTR Jayanthi: ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దాం.. మోదీతో చంద్రబాబు!

Ap politics: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..

Updated Date - May 28 , 2024 | 09:13 PM

Advertising
Advertising