Devineni Uma: జగన్‌కు మీడియా ముందు మాట్లాడే ధైర్యం లేదా?: దేవినేని ఉమా..
ABN, Publish Date - Jul 27 , 2024 | 05:15 PM
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) విధ్వంసకర కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు మీడియా ముందు మాట్లాడే ధైర్యం లేదని, అందుకే ఆయన తాడేపల్లి ప్యాలెస్‌లో బ్లూ మీడియాకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) విధ్వంసకర కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు మీడియా ముందు మాట్లాడే ధైర్యం లేదని, అందుకే ఆయన తాడేపల్లి ప్యాలెస్‌లో బ్లూ మీడియాకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. 151సీట్లు గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు మీడియా ఎదుటికి రాలేదు, మరిప్పుడు 11సీట్లకే పరిమితమైనా రారా? అంటూ జగన్‌ను ప్రశ్నించారు. చెరువు మీద అలిగినవాడి పరిస్థితి ఏమైందో నేడు అసెంబ్లీపై అలిగిన జగన్ పరిస్థితి కూడా అంతే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏపీని అప్పులమయం చేశారు..
ఐదేళ్లలో జగన్ రెడ్డి రూ.12,93,216 కోట్ల ఆర్థిక విధ్వంసం చేశారని, ప్రజలపై రూ.9,74,556కోట్ల భారం మోపారని మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బటన్ నొక్కుడుతో పేద వర్గాలకు ఎంత వెళ్లాయో, తాడేపల్లి ప్యాలెస్‌కు ఎంత వెళ్లాయో ఆర్థికశాఖ లోతైన విచారణ జరపాలని మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 11సీట్లకే పరిమితం చేసినా ఆయన ముఖంలో పశ్చాత్తాపం, పరివర్తన కనిపించడం లేదని మాజీ మంత్రి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ సిగ్గులేకుండా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేశారు..
పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. పోలవరం ప్రాజెక్టు 2,400మీటర్ల విస్తీర్ణం అని జగన్ మాట్లాడుతున్నారు, ఆయన ఇంజినీర్ ఎప్పుడు అయ్యాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. 2021సంవత్సరంలో కేంద్రం నుంచి డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ వచ్చి చెప్పేవరకూ వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందని, వాళ్లు చెప్పేవరకూ వాస్తవాలు బయటకు రాలేదని ఆయన అన్నారు.
ఏజెన్సీ మార్చి గత ప్రభుత్వం తప్పుచేసినట్లు కేంద్రం చెప్పిందని, జగన్ రెడ్డి మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయం వల్ల పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు దేవినేని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని ఢిల్లీలో ధర్నా చేస్తారు గానీ అసెంబ్లీ వచ్చి మాత్రం ఆయన మాట్లాడలేకపోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ట్వీట్లు పెడుతున్న జగన్.. అసెంబ్లీకి మాత్రం రావడం లేదన్నారు. కేవలం తాడేపల్లి ప్యాలెస్‌లో నీలి మీడియాకు పరిమితం అయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చీలిక.. కొత్త అధ్యక్షుడు ఎవరంటే?
AP News: వైసీపీ హయాంలో సర్పంచ్‌లను వేధించారు: వైవీబీ రాజేంద్రప్రసాద్
Updated Date - Jul 27 , 2024 | 05:15 PM