Share News

Jagan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ మరోసారి పిటిషన్

ABN , Publish Date - Aug 21 , 2024 | 03:49 PM

Andhrapradesh: విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. 20 రోజుల పాటు కుటుంబంతో కలిసి లండన్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. లండన్‌లో ఉన్న కూతురుని చూడటానికి వెళ్లాలని..

Jagan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ మరోసారి పిటిషన్
YS Jagamohanreddy

అమరావతి/హైదరాబాద్ 21: విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో (Nampally CBI Court) మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) పిటిషన్ వేశారు. 20 రోజుల పాటు కుటుంబంతో కలిసి లండన్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. లండన్‌లో ఉన్న కూతురుని చూడటానికి వెళ్లాలని, అనుమతి ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది వాదన వినిపించారు. ఈ ఏడాదిలో రెండో సారి విదేశీ పర్యటనకు ఎమ్మెల్యే అనుమతి కోరారు.

Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకి భారీ ఊరట..


ఏపీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత 15 రోజులు పాటు జగన్ విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తిరిగి ఇప్పుడు మరోసారి విదేశాలకు వెళ్లేందుకు జగన్ అనుమతి కోరగా... అనుమతి ఇవ్వదంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు సంబంధించి ఇరువురి వాదనలు పూర్తి అవగా.. తీర్పును ఈనెల 27న వెల్లడిస్తామన్న సీబీఐ కోర్టు తెలిపింది. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన పిటిషన్‌పై ఈనెల 30న సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది.


ఇవి కూడా చదవండి...

Madhuyashki: ఈనెల 22న ఈడీ ఆఫీసుల వద్ద ఆందోళనకు కాంగ్రెస్ సిద్ధం...

Rajendraprasad: పంచాయతీల అభివృద్ధికి రూ.900 కోట్లు జమ చేయడంపై వైవీబీ హర్షం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 21 , 2024 | 03:54 PM