AP Penssions: లక్షల మందిలో ఆనందం నింపిన నాయకుడు..
ABN, Publish Date - Jul 01 , 2024 | 07:50 AM
సామాజిక భద్రత ఫించన్లు దేశంలో కోట్లాది మంది జీవితాలకు భద్రత కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతినెల ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఫించన్లు అందిస్తుంటారు.
సామాజిక భద్రత ఫించన్లు దేశంలో కోట్లాది మంది జీవితాలకు భద్రత కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతినెల ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఫించన్లు అందిస్తుంటారు. వీటిలో కేంద్రప్రభుత్వం(Central Government) వాటా నామమాత్రంగా ఉంటుంది. ఎక్కువ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వాలే భరిస్తాయి. వృద్దాప్యంలో ఎటువంటి పనిచేయలేని పరిస్థితుల్లో.. వారి నెలవారీ అవసరాలు, మందుల కోసం ఫించన్లు ఉపయోగపడుతున్నాయి. కొంతమంది వృద్ధులను కుమారులు, కుమార్తెలు పట్టించుకోకపోవడం లేదా వారిని సంరంక్షించుకునే కుటుంబీకులు లేని వృద్ధులు పెన్షన్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ.3వేల పెన్షన్‌ను రూ.4వేలకు పెంచింది. దీంతో లక్షలాది మంది వృద్ధుల్లో సంతోషాన్ని నింపింది తెలుగుదేశం ప్రభుత్వం. కేవలం వృద్ధులే కాదు.. వితంతువులు, దివ్యాంగులకు సైతం భారీ మొత్తంలో పెన్షన్లు పెంచి వారి జీవితాలకు మరింత భద్రత కల్పించింది.
pension : పింఛన్ల పండగ నేడే అవ్వాతాతల చేతికి 7 వేలు
జీవితాలకు భద్రత..
భర్త చనిపోవడంతో ఓ కుటుంబం అనాథగా మారింది. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్య ఒంటరైంది. ఆ కుటంబం ఆర్థిక భరోసా కోల్పోయింది. పిల్లలు ఉన్నా వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే.. దీంతో తమ తల్లిని పట్టించుకోవాలని ఉన్నా ఆర్థిక సహకారం అందించని పరిస్థితి.. ఇలాంటి స్థితిలో ప్రభుత్వం ఇచ్చే సామాజిక భద్రత ఫించన్లు వితంతువులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2వేల ఫించన్‌ను దశలవారీ పెంచుకుంటూ 2024 నాటికి రూ.3వేలకు పెంచింది.
Botsa Satyanarayana: టీడీపీ విధానాలపై బొత్స సత్యనారాయణ ప్రశంసలు
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకేసారి వెయ్యి రూపాయిలు పెంచి రూ.4వేల పెన్షన్ అందిస్తామని చెప్పింది. ఇచ్చిన హామీ ప్రకారం 2024 జులై నుంచి వితంతువుల పెన్షన్‌ను రూ.4వేలకు పెంచింది. దీంతో వారి జీవితాలకు భద్రతతో పాటు ఆర్థిక భరోసాను ప్రభుత్వం కల్పించింది. ప్రతి నెల ఒకటో తేదీన ఫించను మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తోంది. చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల వ్యవధిలోనే లక్షలాది మంది జీవితాల్లో ఆనందాన్ని నింపారు. అంతేకాదు దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3వేల నుంచి ఒకేసారి మరో రూ.3వేలకు పెంచి రూ.6వేలు అందిస్తున్నారు.
4న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jul 01 , 2024 | 07:50 AM