Kandula Durgesh: కూటమి ప్రభుత్వం నాటక రంగాన్ని ఆదుకుంటుంది
ABN, Publish Date - Aug 12 , 2024 | 02:08 PM
ఎన్టీఏ కూటమి ప్రభుత్వం నాటక రంగాన్ని ఆదుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) వ్యాఖ్యానించారు. నాటక రంగం బతికి ఉండాలి అంటే ప్రభుత్వం అండ ఉండాలని తెలిపారు. తెలుగు బాషా, కళరంగంపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కి అభిమానం ఉందని చెప్పారు.
విజయవాడ: ఎన్టీఏ కూటమి ప్రభుత్వం నాటక రంగాన్ని ఆదుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) వ్యాఖ్యానించారు. నాటక రంగం బతికి ఉండాలి అంటే ప్రభుత్వం అండ ఉండాలని తెలిపారు. తెలుగు బాషా, కళరంగంపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కి అభిమానం ఉందని చెప్పారు. ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకట రత్నం నాయుడు కాంస్య విగ్రహన్ని సోమవారం నాడు ఆవిష్కరించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,మంత్రులు కందుల దుర్గేష్, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ... నాటక రంగం ఎంతో విశిష్టమైనది, సినీ పరిశ్రమకి ఏ మాత్రం తీసిపోని రంగమని వివరించారు. ఆచంట వెంకట రత్నం చాలా గొప్ప రంగస్థలం నటులని చెప్పారు. అలాంటి గొప్ప వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నాటక, సినిమా రంగంలో ప్రశంసలు అందుకున్న గొప్ప నటులని చెప్పారు. నాటక రంగం, సినీ రంగంపై ఎన్టీఆర్ ప్రభావం చాలా ఉందని అన్నారు. నాటకాన్ని అభిమానించే వారు చాలా మంది ఉన్నారని తెలిపారు. గత ఐదేళ్ల నుంచి కళారంగం నిర్వీర్యం అయ్యిందని అన్నారు. నటక రంగంలో ఉన్నా బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పేద కళాకారులను ఆదుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుకి కృషి చేస్తామని అన్నారు. పుణ్యక్షేత్రాల్లో నాటకాలు ప్రదర్శన జరిగితే కళాకారులకు అండగా ఉండవచ్చని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
ఆచంట వెంకటరత్నం నాటక ఖ్యాతిని చాటారు: వెంకయ్య నాయుడు
మరోవైపు... తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం నాయుడు అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కొనియాడారు. వెంకటరత్నం వారసత్వం కొనసాగించాలని కోరారు. వినోదం ప్రజల వద్దకు రాక ముందు నాటకాలే ప్రజలకు వినోదమని వివరించారు. ఆ కాలంలో వచ్చిన నాటకాలు ప్రజలను మంచి మార్గంలో నడిపించాయని చెప్పారు. ఎన్టీఆర్ గొప్ప నటులని ప్రశంసించారు. సినిమాకి పై పై పుతలు పూయాల్సిన అవసరం ఉంటుంది. కానీ నాటకం నిజమని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాటకం కష్టమైందని... ప్రతి డైలాగ్ గుర్తు పెట్టుకొని స్టేజ్‌పై ప్రదర్శన చేయాలని వెంకయ్య నాయుడు అన్నారు.
Updated Date - Aug 12 , 2024 | 02:14 PM