Share News

Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్

ABN , Publish Date - Sep 26 , 2024 | 12:54 PM

Andhrapradesh: కలుగులో ఉన్న ఎలుకలు మళ్లీ బయటకి వచ్చాయంటూ మంత్రి కొల్లురవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖ మంత్రిగా పని చేసి బందరు బస్టాండ్ అభివృద్ధి చేయలేదన్నారు. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని.. పళ్లు రాలిపోతాయంటూ హెచ్చరించారు.

Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్
Minister Kollu Ravindra

కృష్ణాజిల్లా, సెప్టెంబర్ 26: తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని (Former Perninani) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పేర్నినానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కలుగులో ఉన్న ఎలుకలు మళ్లీ బయటకి వచ్చాయంటూ వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖ మంత్రిగా పని చేసి బందరు బస్టాండ్ అభివృద్ధి చేయలేదన్నారు. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని.. పళ్లు రాలిపోతాయంటూ హెచ్చరించారు.

Jr NTR-Devara: జూనియర్ ఎన్టీఆర్‌ను తాకిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం


‘‘మొన్న గుడివాడలో కొట్టినా నీకు సిగ్గు రాలేదా. ఈసారి బందరు ప్రజలే నిన్ను తరమి కొడతారు. కలియుగదైవం వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేని వ్యక్తి జగన్ . అతన్ని వెనుకేసుకు రావడానికి నీకు సిగ్గు, బుద్ధి ఉందా. వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉంటే సతీసమేతంగా ఇవ్వాల్సిన పట్టు వస్త్రాలను గడిచిన ఐదేళ్లలో ఒక్కసారైనా ఇచ్చారా.. మీ నాయకుడి దగ్గరకు వెళ్లి ముందు చొక్కా పట్టుకుని అడుగు. ఇంకోసారి నోటికొచ్చినట్లు వాగితే ... నోరు మూసుకునేలా బుద్ధి చెబుతాం’’ అంటూ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

TG News: ఎస్సై కొట్టాడంటూ ఓ వ్యక్తి ఎంతపని చేశాడంటే..


ఇంతకీ పేర్నినాని ఏమన్నారంటే..

తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని... అలాంటి ప్రసాదాలు భక్తులకు పంచారని అసత్య ప్రచారం చేశారని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. తిరుమల, తిరుపతి పవిత్రతను, లడ్డు ప్రసాదాన్ని దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. పవిత్ర దేవాలయాన్ని, ప్రపంచ వ్యాప్తంగా ఆరాధ్య దైవం అయిన భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ పంది కొవ్వు కలిసిందని మాట్లాడారని.. లోకేష్, సీఎం చంద్రబాబువి దుర్మార్గపు మాటలంటూ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆ మాటలు బుజాన వేసుకొని ప్రచారం చేశారన్నారు. కూటమి నేతలు తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారన్నారు. సెప్టెంబర్ 28న కూటమి నేతల పాపాల్ని క్షమించి వదిలి వేయాలని పూజలు నిర్వహించాలని కోరారు. ప్రాయశ్చిత్త దీక్ష తప్పు చేసిన వాళ్ళు చేస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే ఆత్మగా ఉన్నారన్నారు. రాజకీయాల కోసం వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశామని వాళ్ళ ఆత్మ దహించుకుపోతుందని.. అందుకే గుళ్ళలో మెట్లు కడగటాలు, బోట్లు పెట్టడాలు, ప్రాయచిత్త దీక్ష చేస్తున్నారన్నారు.


ఇవి కూడా చదవండి...

Tirumala Laddu: తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు

Kondapalli Srinivas: న్యూయార్క్‌లో మంత్రి కొండపల్లి... ఎవరెవరిని కలిశారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2024 | 12:55 PM