ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ravindra: అందుకే కీలక పత్రాలు తగులబెట్టారు.. మంత్రి రవీంద్ర షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jul 07 , 2024 | 05:30 PM

ప్రజాదర్బార్‌లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. మచిలీపట్నంలో ఈరోజు(ఆదివారం) ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు ఇచ్చారు.

Minister Kollu Ravindra

కృష్ణా: ప్రజాదర్బార్‌లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. మచిలీపట్నంలో ఈరోజు(ఆదివారం) ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు ఇచ్చారు. ఈ సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు వాటిని పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా దర్బార్ ప్రజల సమస్యలు పరిష్కారం కోసం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టి కి తీసుకురావాలని కోరారు.


పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డాక్యుమెంట్లు దగ్ధం కేసు దర్యాప్తు సాగుతుందని చెప్పారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని అన్నారు. గత పాలకులు, అధికారులు కలిసి అనేక అక్రమాలు, అవకతవకలు చేశారని ఆరోపించారు. తప్పు బయట పడుతుందనే భయంతో సాక్ష్యాలు లేకుండా పత్రాలు తగుల పెట్టారని అన్నారు. రేపటి నుంచి ఉచిత ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని స్పష్టం చేశారు. 120 స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను ప్రజలకు అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Updated Date - Jul 07 , 2024 | 06:21 PM

Advertising
Advertising
<