vasamsetti subhash: అసలు జగన్‌కు మతిస్థిమితం ఉందా..
ABN , Publish Date - Dec 10 , 2024 | 04:43 PM
Andhrapradesh: దిశాచట్టంపై అసెంబ్లీలో తీర్మానం చేసి చప్పట్లు కొట్టారు తప్ప గత ప్రభుత్వం దిశాచట్టం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. అసలు దిశకు దిశానిర్ధేశం ఏమైనా ఉందా... ఒక అమ్మాయి బలైనప్పుడు ఏడు రోజుల్లోగా ఎంక్వైరీ అయిపోవాలన్నారు. 14 రోజుల్లో చార్జి షీట్ వేయాలని... ఇలా ఒక్క కేసు అయినా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారా అని నిలదీశారు.
అమరావతి, డిసెంబర్ 10: మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jaganmohan Reddy) దిశాచట్టం గురించి మాట్లాడుతూ మంత్రి లోకేష్, హోంమంత్రి గురించి మాట్లాడారని.. అసలు దిశాచట్టం అమలులో ఉందా? వైసీపీ హయాంలో ఎన్ని ట్రయిల్స్ జరిపారు? ఎంత మందికి శిక్ష వేశారు? అని కార్మిక శాఖామంత్రి మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Vasamsetti Subhash) ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో తీర్మానం చేసి చప్పట్లు కొట్టారు తప్ప గత ప్రభుత్వం దిశాచట్టం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అసలు దిశకు దిశానిర్ధేశం ఏమైనా ఉందా... ఒక అమ్మాయి బలైనప్పుడు ఏడు రోజుల్లోగా ఎంక్వైరీ అయిపోవాలన్నారు. 14 రోజుల్లో చార్జి షీట్ వేయాలని... ఇలా ఒక్క కేసు అయినా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారా అని నిలదీశారు.
26 ఏళ్ల తరువాత నిజమైన ఎలాన్ మస్క్ జోస్యం.. వీడియో వైరల్
కఠినమైన శిక్షలు...
2023లో భారతీయ న్యాయ సంహిత అమలులోకి వచ్చాక కఠినమైన శిక్షలు ఇలాంటి నేరాలకు అందులో పొందుపర్చారని తెలిపారు. మాజీ సీఎం జగన్ పప్పు, తుప్పు అన్నారని.. చివరకు తుక్కు ఊడి పోయి 11 సీట్లతో మిగిలారంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మాజీ ముఖ్యమంత్రికి మతి స్ధిమితం ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తాము మరోసారి అధికారంలోకి వస్తే చంద్రబాబును జైల్లో పెడతాను అంటున్నారని.. ఒక సారి పెట్టినందుకు ఏమైందో ఇంకా తెలిసి రాలేదా అని ప్రశ్నించారు.
మందుల రూపంలో అవినీతి...
కార్మిక శాఖలో అయిదు సంవత్సరాలు గత ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నిధులు వెనెక్కి వెళ్లిపోయాయన్నారు. 2021-22 లో 3593మంది భీమా అప్లై చేస్తే 953 మందికే ఇచ్చారని తెలిపారు. కార్మికుల దేహాలపై చిల్లర ఏరుకున్నారంటూ మండిపడ్డారు. సూళ్లూరుపేటలో ఒకే సంవత్సరంలో 48 మెడికల్ క్యాంపులు పెట్టాన్నారు. అక్కడ ఏది బడితే అది మందుల రూపంలో ఇచ్చి దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారని వ్యాఖ్యలు చేశారు. కార్మికుడి ఆరోగ్యంపై ఎలాంటి చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి లేదన్నారు. అప్పట్లో ప్రతి శాఖలో అవినీతిమయమే అని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మొదటి మీటింగ్‌లోనే కక్షసాధింపులు ఉండవు అని తెలిపారన్నారు. ప్యాక్టరీలలో జరిగే ప్రమాదాలపై వసుద మిశ్రా ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశారని తెలిపారు. ఆవిడ నివేదిక అందించాక దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.
వారిని ఉపేక్షించం...
ప్యాక్టరీల్లో యాక్సిడెంట్స్ జరగకుండా చూస్తామన్నారు. మహిళలను ఇబ్బంది పెడుతూ పోస్టులు పెట్టేవారిని ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారన్నారు. జగన్ అవగాహన లేని మాటలు మాట్లాడి ప్రజల్లో చులకన అవ్వద్దంటూ హితవుపలికారు. 96 డిస్పన్సరీలు ఉన్నాయని... వీటికి సంబంధించి ఇండెండ్‌లు పెట్టామన్నారు. యలమంచిలిలో ఈఎస్‌ఐ ఆసుపత్రికి శంఖుస్ధాపన చేశామన్నారు. అమరావతిలో 150 బెడ్ల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్యాక్టరీలలో 256 హైరిస్క్ అని గత ప్రభుత్వంలో గుర్తించారన్నారు. ఈ ప్యాక్టరీల భద్రతపై సేప్టీ ఆడిట్ చేయడానికి 70 కంపెనీలు ఉండగా కేవలం 4 కంపెనీలకు ఇచ్చారన్నారు. దీంతో ఆయా కంపెనీలు తప్పుడు రిపోర్టులు ఇచ్చాయని తెలిపారు. అందుకే ఎలాంటి పొరపాటు జరగకుండా సేప్టీ ఆడిట్ విషయంలో నిబంధనలు కఠినతరం చేశామని చెప్పారు.
ఆడిట్ చేసే సంస్ధకు 25 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలనే నిబంధనను పెట్టామన్నారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాయవచ్చని.. సీఎం దృష్టికి తన అభిప్రాయాన్ని తీసుకెళ్లవచ్చని.. సీఎం దానిపై పరిశీలించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. గత అయిదేళ్లు భవన నిర్మాణ కార్మికులకు పథకాలు కూడా జగన్ సర్కార్ తీసేసిందన్నారు. ఇసుక దొరకకుండా చేసి భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Lagacharla: లగచర్ల దాడి కేసు.. విచారణలో సంచలన విషయాలు
Read Latest AP News And Telugu News