Share News

Parliament: పార్లమెంట్‌లో బీసీల సమస్యలపై చర్చించిన తెలంగాణ ఎంపీలు..

ABN , Publish Date - Mar 18 , 2025 | 03:12 PM

BC issues in Parliament: పార్లమెంట్‌లో ఇవాళ బీసీ రిజర్వేషన్‌లపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, ఈటల రాజేందర్, వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని ఎంపీలు డిమాండ్ చేశారు.

Parliament: పార్లమెంట్‌లో బీసీల సమస్యలపై చర్చించిన తెలంగాణ ఎంపీలు..
BC issues in Parliament

ఢిల్లీ: బీసీల సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో ఇవాళ(మంగళవారం) చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, ఈటల రాజేందర్, వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. చట్టసభల్లో మహిళలకు కేటాయించిన 33శాతం రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు 50శాతం సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళ సబ్ కోటాకు రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించాలని ఎంపీలు కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ మహిళలకు సబ్ కోటా బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని ఎంపీలు డిమాండ్ చేశారు.


కాగా.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కులగణన సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా 27.88 శాతమే ఉంది. అంటే వారికి స్థానిక సంస్థల్లో 27 నుంచి 28 శాతం వరకు రిజర్వేషన్‌ కల్పించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీలకు 22 నుంచి 23 శాతం రిజర్వేషన్‌ మాత్రమే దక్కే అవకాశం ఉంది. బీసీ జనాభా దామాషా ప్రకారం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ పెంచాలంటే పార్లమెంటులో చట్ట సవరణ చేయడంతో పాటు 9వ షెడ్యూల్‌లో పేర్కొనాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి

Dana Nagender serious statement: నేను సీనియర్‌‌ను.. మీరు చెప్తే నేను వినాలా.. దానం ఫైర్

DCP Vijay Kumar: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవ్వరినీ వదలం: డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 18 , 2025 | 03:14 PM