ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: సీనియర్లు దూరంగా.. జూనియర్లు పక్కచూపులు..

ABN, Publish Date - Aug 04 , 2024 | 08:07 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో సీనియర్లు కనిపించడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు రోజూ మీడియా ముందు కనిపించే నేతలు.. గత రెండు నెలలుగా ఏమైందో ఏమో గాని ప్రజల్లో కనిపించడంలేదనే టాక్ వినిపిస్తోంది.

YSRCP

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో సీనియర్లు కనిపించడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు రోజూ మీడియా ముందు కనిపించే నేతలు.. గత రెండు నెలలుగా ఏమైందో ఏమో గాని ప్రజల్లో కనిపించడంలేదనే టాక్ వినిపిస్తోంది. కొందరు నేతలు తమ వ్యక్తిగత పనులు, వ్యాపార పనుల్లో బిజీగా ఉంటే మరికొందరు నేతలు ఇంట్లోనే ఉంటూ సైలెంట్ అయిపోయారట. ఇంకొదరైతే ఎక్కడ ఉన్నారో కూడా కనీసం తమ అనుచరులకు చెప్పడంలేదట. దీంతో తమను పట్టించుకునే నాధుడు లేక ద్వితీయశ్రేణి నాయకులు అధికారపార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లా స్థాయిలో కొందరు స్థానిక నేతలు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. ఓ వైపు సీనియర్లంతా తమ పనుల్లో బిజీగా ఉండటంతో కింది క్యాడర్‌ను ఎవరూ పట్టించుకోవడంలేదట. ఇక అధికారపార్టీలో ఉంటే తమకు రానున్న ఐదేళ్లూ పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో స్థానిక నేతలు కూటమి వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Kiran Kumar Reddy: ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా చంద్రబాబు నిలబెడతారు


మాజీలు మాయం..!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీలో సీనియర్ నేతలంతా ప్రస్తుతం మాజీలయ్యారు. మంత్రులుగా పనిచేసినవారు సైతం ఎందరో ఓడిపోవడంతో వారి జాడ పార్టీలో కనిపించడంలేదట. ఓవైపు అధినేత మాత్రం పార్టీ శ్రేణులకు అండగా ఉండాలని, స్థానిక క్యాడర్‌ను పట్టించుకోవాలని చెబుతున్నా మాజీలు మాత్రం పెద్దగా స్పందిచడం లేదట. స్థానిక నాయకులు, కార్యకర్తలకు మాత్రం అసలు అందుబాటులో ఉండటం లేదనే చర్చ జరుగుతుంది. మాజీల మాయం వెనుక అసలు కథ ఏమిటో శ్రేణులకు అర్థంకావడం లేదట. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డారానే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అకారణంగా విపక్ష నేతలను దూషించడంతో పాటు దాడులకు ఉసిగొల్పిన ఘటనలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఈక్రమంలో వైసీపీకి దూరంగా ఉంటూ.. నోరు మెదపకపోతే తమను క్షమించేస్తారనే ఒక ఆలోచనతో సైలెంట్ అయి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.

Minister Atchannaidu: రైతులు అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం


కొన్నిచోట్ల..

ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ద్వితీయశ్రేణి నాయకులను అధికారపార్టీలోకి వెళ్లిపోవాలని సీనియర్లే సూచిస్తున్నారట. తమను పార్టీలో చేర్చుకోరని.. ఈ పరిస్థితుల్లో కిందిస్థాయి క్యాడర్ కూటమి పార్టీల్లో చేరితే వారి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదనే ఆలోచనతో టీడీపీ, జనసేనలో చేరాలని కొందరు నేతలు సలహాలు ఇస్తున్నారట. మరోవైపు ఒక నలుగురైదుగురు నేతలు మినమా మిగిలిన సీనియర్ నేతలంతా ప్రస్తుతం కనిపించడంలేదని, వైసీపీ అధినేతకు టచ్‌లోకి రావడంలేదన్న చర్చ జరుగుతోంది. ఈక్రమంలో వైసీపీ అధినేత జగన్ తమ క్యాడర్‌ను కాపాడుకోవడానికి ఏమి చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది.


Nara Lokesh: ఐఐటీ విద్యార్థికి అండగా మంత్రి నారా లోకేశ్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 04 , 2024 | 08:13 PM

Advertising
Advertising
<