ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: విజయవాడ సబ్ కలెక్టరేట్‌లో బీమా సంస్థల స్టాల్స్ ఏర్పాటు..

ABN, Publish Date - Sep 10 , 2024 | 08:11 PM

విజయవాడలో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తి దెబ్బతిన్న వాహనాలు, విద్యుత్ పరికరాలు, ఇళ్ల ఇన్సూరెన్స్ సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులు సింగిల్ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పత్యేక చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

అమరావతి: విజయవాడలో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తి దెబ్బతిన్న వాహనాలు, విద్యుత్ పరికరాలు, ఇళ్ల ఇన్సూరెన్స్ సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులు సింగిల్ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పత్యేక చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే బీమా సంస్థలతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ(మంగళవారం) ఆయన భేటీ నిర్వహించారు. క్లెయిమ్‌ల పరిష్కరానికి ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ మేరకు బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సింగిల్ విండోలో క్లెయిమ్‌లు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.


విజయవాడ వరద బాధితులకు సాయం అందించేందుకు అన్ని కోణాలూ అధ్యయనం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బాధితులకు ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు బీమా క్లెయిమ్‌లపై దృష్టి సారించారు. బీమా సంస్థలతో భేటీ నిర్వహించిన సీఎం ఈ మేరకు సబ్ కలెక్టర్ ఆఫీసులో స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వరదలో నష్టం వాటిల్లిన వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఒకే చోట చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలు, విద్యుత్ పరికరాలే కాకుండా చిన్న, మధ్యతరహా వ్యాపారులకూ తొందరగా సెటిల్ చేసేలా చర్యలు చేపట్టారు. దీంతో వారం నుంచి 10రోజులలోపే దరఖాస్తు చేసుకున్న వారికి సెటిల్ అయ్యే అవకాశం ఉంది.


బీమా చేయించుకున్న వారు వాట్సాప్ నంబరు 8106602976 లేదా టోల్ ఫ్రీ నంబరు 92400 21400 ను సంప్రదించి వివరాలు పొందవచ్చు. వరద వల్ల అతలాకుతలం అయిన తమకు ఒకే చోట సింగిల్ విండో సెటిల్మెంట్ చేయిస్తున్న సీఎంకు చందాదారులు, బీమా సంస్థల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ద్విచక్రవాహనాలకు రూ.7వేల లోపు, ఆటోలు, ఫోర్ వీలర్స్‌కు రూ.15వేల లోపయితే వెంటనే సెటిల్ చేస్తామని సంస్థలు చెబుతున్నాయి. అలాగే రూ.10లక్షల పైన ఇన్సూరెన్స్ చేయించుకున్న వారితో మాట్లాడి.. వారు ఓకే అంటే కొంచెం అటు ఇటుగా సెటిల్మెంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీమా కంపెనీలు చెబుతున్నాయి.

ఈ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..

Janasena: జనసేన జెండాకు ఘోర అవమానం.. భగ్గుమన్న జనసైనికులు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

CM Chandrababu: సీఎం చంద్రబాబు విజ్ఞప్తి.. ముందుకొచ్చిన ఎలక్ట్రానిక్ కంపెనీలు

Updated Date - Sep 10 , 2024 | 08:14 PM

Advertising
Advertising