ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Supreme Court: ఇసుక తవ్వకాలపై సుప్రీం ఫైర్.. నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం

ABN, Publish Date - Apr 29 , 2024 | 12:16 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఉన్నతన్యాయస్థానం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని జగన్‌ సర్కార్‌ను సుప్రీం ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీం ధర్మాసనం ఆర్డర్స్ పాస్ చేసింది.

Supreme Court Fire on AP Govt

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి (CM Jaganmohan Reddy) సుప్రీం కోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఉన్నతన్యాయస్థానం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను (Illegal Sand Mining)వెంటనే నిలిపివేయాలని జగన్‌ సర్కార్‌ను సుప్రీం ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీం ధర్మాసనం ఆర్డర్స్ పాస్ చేసింది.

Dhulipalla Narendra: జగన్‌కి కప్పం కడితే దోపిడి, హత్యలకు పర్మిషన్ ఇస్తారు


అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలపై తీసుకున్న చర్యలపై మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖను ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తేదీలోపు అక్రమ ఇసుక తవ్వకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్జీటీ తీర్పుపైన ఎలాంటి స్టే విధించలేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

AP Election 2024: నేతలకు పార్టీలు శాశ్వతం కాదంటే ఇదేనేమో!.. వీరశివారెడ్డి రూటే వేరబ్బ...


అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎన్జీటిని కూడా సుప్రీం ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని జేపీ వెంచర్స్‌కు కూడా ఆదేశాలు జారీచేసింది. పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనుమతులు ఉన్న చోట మ్యానువల్‌గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని పేర్కొంది. పిటీషనర్ నాగేంద్ర కుమార్ అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించింది.

AP Elections: వైసీపీ చివరి అస్త్రం ఇదే.. పైసలపైనే జగనన్న నమ్మకం..


పిటీషనర్ ఫిర్యాదులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చట్టాల మేరకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణ మే 10కి వాయిదా వేసింది. కాగా.. ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలుకు సమయం ఎక్కువ కావాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఉన్నతన్యాయస్థానం త్రోసిపుచ్చింది. ఎన్నికల కన్నా పర్యావరణ అంశాలే ముఖ్యమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది.


ఇవి కూడా చదవండి....

Delhi: కలుషిత ప్రాంతాల్లో తిరుగుతున్నారా.. జుట్టు రాలడంతోపాటు మరో ప్రమాదం

Lankadinakar: జగన్ చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత.. దోచుకుంది అనకొండంత...

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 12:25 PM

Advertising
Advertising