ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేషం, భాష మారిపోయాయి.. షర్మిల విసుర్లు

ABN, Publish Date - Oct 04 , 2024 | 01:14 PM

అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఒక మతానికే ప్రతినిధిగా పవన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ వేషం వేసుకుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చర్యల వల్ల ఇతర మతాలను ఆచరించే వారిలో అభద్రతా భావం ఏర్పడదా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారని షర్మిల విమర్శలు చేశారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్రా ఏఐసీసీ అగ్రనేత హుల్ గాంధీపై విమర్శలు చేయడం పెద్ద జోక్ అని విమర్శించారు. అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేషం, భాష మారిపోయాయని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎంగా అన్నివర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇవాళ(శుక్రవారం) షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని కోరారు.


ఒక మతానికే ప్రతినిధిగా పవన్ వ్యవహారిస్తున్నారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఆ వేషం వేసుకుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చర్యల వల్ల ఇతర మతాలను ఆచరించే వారిలో అభద్రతా భావం ఏర్పడదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారని విమర్శలు చేశారు. ఆర్.యస్.యస్ భావజాలం బీజేపీ పాటిస్తుందని వైఎస్ షర్మిల ఆరోపించారు.


జనసేన సెక్యులర్ పార్టీ అనుకున్నామని.. కానీ పవన్ కూడా ఆర్.యస్.యస్ సిద్దాంతంతో వెళ్తున్నారా అని వైఎస్ షర్మిల నిలదీశారు. మణిపూర్‌లో‌ క్రైస్తవులపై ఊచకోత కోస్తే పవన్ ఎందుకు మాట్లాడరని వైఎస్ షర్మిల అడిగారు. ఇతర మతాల వారు ఓట్లు వేస్తేనే పవన్ గెలిచారనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ఇప్పుడు ఒకే మతం అంటున్న పవన్‌ను ఇతర మతాల వారు ఆదరిస్తారా అని వైఎస్ షర్మిల నిలదీశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ యాత్ర చేశారని గుర్తు చేశారు. అటువంటి నేతను... పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాయ నుంచి పవన్ కళ్యాణ్ బయటకురావాలని వైఎస్ షర్మిల హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గాయత్రీ దేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు..

భద్రాచలంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 04 , 2024 | 01:20 PM