AP Politics: కాంగ్రెస్ మద్దతు కోసం జగన్ కొత్త ఎత్తుగడ..!

ABN, Publish Date - Jul 27 , 2024 | 11:46 AM

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారా.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందుకొచ్చి అడిగితే జట్టు కట్టేందుకు రెడీ అతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

AP Politics: కాంగ్రెస్ మద్దతు కోసం జగన్ కొత్త ఎత్తుగడ..!
YS Jagan

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారా.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందుకొచ్చి అడిగితే జట్టు కట్టేందుకు రెడీ అతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా జగన్ (YS Jagan) స్వరం చూస్తుంటే మాత్రం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాతీయపార్టీ నేతృత్వంలోని ఏదో ఒక కూటమిలో ఉంటేనే భవిష్యత్తులో పార్టీ మనుగడ సాధ్యమనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీలో పరిస్థితులు, శ్వేతపత్రాలపై వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు జగన్ ఇండియా కూటమికి దగ్గరవ్వాలనే ఆలోచనలో ఉన్నారన్న వాదనకు బలం చేకూరుస్తుంది. ఓవైపు తన సొంత చెల్లి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా ఉండటంతో నేరుగా కాంగ్రెస్‌తో సంప్రదింపులకు జగన్ ఇష్టపడుతున్నట్లు లేరనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరైనా తనతో నేరుగా సంప్రదించి కూటమిలో చేరాలని అడిగితే మాత్రం తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను జగన్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే కూటమి కట్టిన పార్టీలకు లాభం జరిగింది. ఒంటరిగా ఎన్నికల్లో పోటీచేసిన పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా కూటమితో కలిసి ముందుకెళ్తేనే ప్రయోజనం ఉంటుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

AP News: నేడు వరద ముంపు మండలాల్లో పర్యటించనున్న మంత్రుల బృందం..


జగన్ ఏమన్నారంటే..

ఢిల్లీలో వైసీపీ నిర్వహించిన ధర్నాకు అన్ని పార్టీలను పిలిచామని, కొందరు మాత్రమే వచ్చారని జగన్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలను కూడా ఆహ్వానించామన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ధర్నాకు ఎందుకు మద్దతు తెలపలేదో ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి టచ్‌లో ఉన్నారని, అందుకే తన ధర్నాకు మద్దతు తెలపలేదనేలా జగన్ మాట్లాడారు. తనకు ఎవరు మద్దతు ఇస్తే వారితో కలిసి వెళ్తామన్నారు. దీంతో కాంగ్రెస్ తనకు మద్దతు పలికితే ఇండియా కూటమితో కలిసి వెళ్లేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చినట్లేనన్న అభిప్రాయాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh: పెద్దిరెడ్డీ.. దీన్నేమంటారు..?


రాహుల్‌కు జగన్ ప్రశ్నలు..

మణిపూర్ అల్లర్లపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఏపీలో విధ్వంసంపై ఎందుకు మాట్లాడటం లేదని జగన్ ప్రశ్నించారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎలాంటి శాంతి, భద్రతల సమస్య లేనప్పటికీ.. ఏదో సమస్య ఉందనే అసత్య ప్రచారాన్ని చేస్తుండటంతోనే కాంగ్రెస్ మద్దతు పలకలేనట్లు తెలుస్తోంది. ఎస్పీతో పాటు వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపిన కొన్ని పక్షాలకు సంబంధించిన పార్టీ ఏపీలో లేదు. అక్కడి రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండి ఉండకపోవచ్చు. కానీ కాంగ్రెస్ జాతీయపార్టీ కావడం, అక్కడ పీసీసీ చీఫ్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి సోదరి కావడంతో.. ఆమెను అడిగి తాజా రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేతలు నివేదిక తెప్పించుకునే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రశాఖ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే జగన్ ధర్నాకు హస్తం పార్టీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వినుకొండ హత్య వ్యక్తిగతమైనదని.. దానిని జగన్ రాజకీయం చేస్తున్నారంటూ ఇప్పటికే షర్మిల స్పష్టం చేశారు. దీంతో జగన్ ధర్నాలో నిజం లేదని గ్రహించి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ ఇండియా కూటమితో కలుస్తారా లేదా మరేదైనా వ్యూహంతో ముందుకెళ్తారా అనేది వేచి చూడాలి.


YS Jagan: జగన్‌ పత్రికకు జనం సొమ్ము

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 27 , 2024 | 11:46 AM

Advertising
Advertising
<