Share News

Kurnool: రాయలసీమ వర్సిటీలో దాహం కేకలు...

ABN , Publish Date - Nov 08 , 2024 | 09:48 AM

రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థులు నీటి సమస్యతో తల్లడిల్లుతున్నారు. కర్నూలు కార్పొరేషన్‌(Kurnool Corporation) అధికారులు తాగునీరు సరఫరా చేయడం లేదు. దీంతో వర్సిటీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. నీటి కోసం నెలకు రూ.6.50 లక్షలు చొప్పున ఏడాదికి సరాసరి రూ.75 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు.

Kurnool: రాయలసీమ వర్సిటీలో దాహం కేకలు...

- విద్యార్థులను వేధిస్తున్న తాగు నీటి సమస్య

- పైపులైన్‌ నిర్మించినా నీటిని మళ్లించని దుస్థితి

- వాటర్‌ ట్యాంకర్ల ద్వారా సరఫరా

- ఏడాదికి రూ.75 లక్షల ఖర్చు

కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థులు నీటి సమస్యతో తల్లడిల్లుతున్నారు. కర్నూలు కార్పొరేషన్‌(Kurnool Corporation) అధికారులు తాగునీరు సరఫరా చేయడం లేదు. దీంతో వర్సిటీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. నీటి కోసం నెలకు రూ.6.50 లక్షలు చొప్పున ఏడాదికి సరాసరి రూ.75 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. యూనివర్సిటీకి ఇది ఆర్థిక భారమే కాక.. విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కర్నూలు నగర శివారున 2008లో రాయలసీమ యూనివర్సిటీని స్థాపించారు.

ఈ వార్తను కూడా చదవండి: Guntur: భూమితో బంధం తెగుతోంది


యూజీసీ అక్రిడిటేషన్‌ కలిగిన ఈ వర్సిటీలో 14 పీజీ, యూజీ కోర్సులు, అనుబంధంగా ఇంజనీరింగ్‌ కళాశాల కూడా ఉంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,200 మంది విద్యార్థులు పీజీ సహా ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఇంజనీరింగ్‌ కోర్సు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ హాస్టళ్లలో ఉంటూ చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలికల హాస్టల్‌లో 470 మంది, బాలుర హాస్టల్‌లో 450 మంది విద్యార్థులు ఉంటున్నారు. ప్రధానంగా తాగునీటి సమస్య విద్యార్థులతో పాటు అధ్యాపకులను వెంటాడుతోంది. నీటి సమస్య తీర్చాలంటూ 15 ఏళ్లుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.


ఏ ప్రభుత్వం కూడా వర్సిటీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో వేసవి కాలంలో విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. శుద్ధి చేసిన తాగునీటి సరఫరా చేయాలంటూ 2016లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి కలెక్టరు కర్నూలు కార్పొరేషన్‌ అధికారులతో చర్చించి తాగునీటి పైపులైన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కర్నూలు కార్పొరేషన్‌ ఇంజనీర్లు రూ.1.13 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. దీంతో యూనివర్సిటీ అధికారులు రూ.81.68 లక్షలు చెల్లించారు.


కర్నూలు కార్పొరేషన్‌ అధికారులు యూనివర్సిటీకి తాగునీటి పైపులైన్‌ వేసినా రెండు మూడు నెలలు మాత్రమే నీటిని విడుదల చేశారు. ఆ తరువాత పైపులను క్లోజ్‌ చేశారు. అప్పటి నుంచి ఎనిమిదేళ్లుగా వర్సిటీలో నీటి సమస్య జఠిలమైంది. కార్పొరేషన్‌ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం శూన్యం. తాగునీరు మాత్వం ఇవ్వడం లేదు. అదే సమయంలో బోర్లు కూడా పని చేయడం లేదు. దీంతో విద్యార్థుల అవసరాల కోసం రోజుకు బాలికల హాస్టల్‌కు 30 ట్యాంకులు, బాలుర హాస్టల్‌కు 25-30 ట్యాంకులు ఒక్కో ట్యాంకు రూ.320 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు.


అలాగే.. తాగడానికి ఆర్‌వో వాటర్‌ వ్యాన్ల నీటి కోసం రూ.5.500 ఖర్చు చేస్తున్నారు. దినసరి అవసరాలకు కోసం, తాగునీటి కోసం రోజుకు సరాసరి రూ.21 వేలు చొపున నెలకు రూ.6.30 లక్షలు, ఏడాదికి రూ.75 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. కార్పొరేషన్‌ నీటిని సరఫరా చేస్తే దాదాపు సగానికి పైగా ఖర్చు తగ్గడమే కాకుండా శుద్ధి చేసిన స్వచ్ఛమైన తుంగభద్ర జలాలు అందుతాయి. నగరపాలక సంస్థ నుంచి నీటి సరఫరా చేయకపోవడంతో రూ.లక్షలు ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, జిల్లా యంత్రాంగం స్పందించి కార్పొరేషన్‌ ద్వారా నీటిని సరఫరా చేసి రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థుల దాహం తీర్చాలని పలువురు కోరుతున్నారు.


నీటి సమస్య వాస్తవమే

యూనివర్సిటీలో నీటి సమస్య వాస్తవమే. విద్యార్థుల రోజువారి అవసరాలు తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా, తాగునీటి కోసం ఆర్‌వో వాటర్‌ కొనుగోలు చేస్తున్నాం. రోజుకు దాదాపుగా రూ.20 వేలు ఖర్చు చేస్తున్నాం. ఒకబోరు రిపేరి చేయించడం వల్ల కొంతవరకు ఆదా చేయగలిగాం. కర్నూలు కార్పొరేషన్‌ నుంచి శుద్ధి చేసిన నీటిని సరఫరా కోసం పైపులైన్‌ ఉన్నా.. నీళ్లు రావడం లేదు. 2016లో నీటి కోసం కార్పొరేషన్‌కు రూ.81.68 లక్షలు చెల్లించాం.

-ఫ్రొసెసర్‌ ఎన్‌టీకే నాయక్‌, ఇన్‌చార్జి వైస్‌ ఛాన్స్‌లర్‌, రాయలసీమ వర్సిటీ, కర్నూలు


ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్‌ నుంచి నగరానికి హెరాయిన్‌.. ఐటీ కారిడార్‌లో విక్రయం

ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 08 , 2024 | 09:48 AM