Share News

ఫ్యామిలీ ఉండాల్సిందే!

ABN , Publish Date - Mar 17 , 2025 | 01:31 AM

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వైఫల్యం తర్వాత ఆటగాళ్లపై బీసీసీఐ కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఇందులో ప్లేయర్స్‌ వెంట కుటుంబ సభ్యుల బసపై పరిమితి కూడా ఉంది..

ఫ్యామిలీ ఉండాల్సిందే!

విరాట్‌ కోహ్లీ

బెంగళూరు: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వైఫల్యం తర్వాత ఆటగాళ్లపై బీసీసీఐ కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఇందులో ప్లేయర్స్‌ వెంట కుటుంబ సభ్యుల బసపై పరిమితి కూడా ఉంది. 45 రోజులకుపైగా విదేశీ పర్యటన ఉంటే కుటుంబ సభ్యులు కేవలం రెండు వారాలపాటు మాత్రమే ఉండేందుకు అనుమతిస్తారు. అయితే ఈ నిర్ణయంపై విరాట్‌ కోహ్లీ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ‘మైదానంలో కఠిన పరిస్థితులు ఏర్పడినప్పుడు కుటుంబసభ్యులతో గడిపితే సాంత్వనగా ఉంటుంది. అలాంటి వేళ వారి మద్దతు అవసరమే. ఏ క్రికెటర్‌ను అడిగినా ఇదే చెబుతాడు. మ్యాచ్‌ ఆడాక రూమ్‌కి వెళ్లి ఒంటరిగా, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండలేను. క్రికెట్‌ ఆడడం మా బాధ్యత. అదయ్యాకే కుటుంబం గురించి ఆలోచిస్తాం. నేనైతే ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేసే సమయాన్ని వదులుకోను’ అని విరాట్‌ తేల్చాడు.

తిండిపై చర్చ ఎందుకు?: తన వ్యక్తిగత విషయాలపై బ్రాడ్‌కాస్టర్లు చర్చించాల్సిన అవసరం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. ‘‘బ్రాడ్‌కాస్ట్‌ షోలో క్రికెట్‌ గురించే మాట్లాడుకోవాలి కానీ ‘విరాట్‌ నిన్న లంచ్‌లో ఏం తిన్నాడు? అతడికిష్టమైన ఛోలే భటూరే ఢిల్లీలో ఎక్కడ దొరుకుతుందనే విషయాలపై చర్చ అనవసరమ’’ని కోహ్లీ సూచించాడు.


శాంసన్‌ వస్తున్నాడు..

బెంగళూరు: ఐపీఎల్‌ ఆరంభానికి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ అభిమానులకు శుభవార్త. ఆ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ చేతివేలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈమేరకు అతడికి బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ) నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ అందింది.

ఇవి కూడా చదవండి..

Virat Kohli On BCCI: తలతిక్క రూల్స్ అవసరమా.. బీసీసీఐపై కోహ్లీ సీరియస్

Australian Grand Prix 2025: ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో సంచలనం.. వరల్డ్ చాంపియన్‌కు షాక్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 17 , 2025 | 01:31 AM

News Hub