Share News

చికెన్‌ ధర తగ్గింది

ABN , Publish Date - Mar 17 , 2025 | 01:06 AM

చికెన్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం అమ్మకాలు కొంతవరకు పెరిగాయి.

చికెన్‌ ధర తగ్గింది

తణుకు రూరల్‌, మార్చి 16 (ఆంధ్ర జ్యోతి): చికెన్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం అమ్మకాలు కొంతవరకు పెరిగాయి. గత రెండు వారాలతో పోల్చితే ఈ వారం అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు చెబుతు న్నారు. బర్డ్‌ఫ్లూ కారణంగా వేల్పూరు, బాదం పూడి, కానూరు గ్రామాల్లో రెడ్‌జోన్‌ ప్రకటిం చి చికెన్‌ వినియోగంపై ఆంక్షలు విధించారు. వైరస్‌ ప్రభావం తగ్గడంతో చికెన్‌, కోడిగుడ్లను తినవచ్చంటూ ఈనెల 1 నుంచి అధికారులు, పౌలీ్ట్ర యజమానులు, నెక్‌ సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా లోని పలుచోట్ల చికెన్‌, ఎగ్‌ మేళా నిర్వహిం చారు. ఫలితంగా గత రెండు వారాలుగా చికెన్‌ అమ్మకాలు సాగుతున్నా అంతంత మాత్రం. గత వారం కిలో లైవ్‌ చికెన్‌ ధర రూ.80 నుంచి రూ.90 మధ్య ఉండగా ఈ వారం రూ.75 నుంచి రూ.80 మధ్య ఉంది. చికెన్‌ రిటైల్‌గా స్కిన్‌తో రూ.139 స్కిన్‌లెస్‌ రూ.159 అమ్మకాలు సాగాయి. చికెన్‌ ధరలు తగ్గడంతో పాటు చికెన్‌ వినియోగంపై అపో హలు కూడా తొలగిపోవడంతో అమ్మకాలు పెరిగాయి. ఈ మేరకు మటన్‌ అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. చికెన్‌ కొనుగోలు విని యోగదారులు వెనకాడడంతో మటన్‌ ధర ఒక్కసారిగా కేజీ రూ.వెయ్యి పలికింది. జిల్లాలో ఇప్పటికీ అదే ధరకు అమ్మకాలు సాగుతున్నాయి.

Updated Date - Mar 17 , 2025 | 01:06 AM