అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళి
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:04 AM
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణ లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం పలువురు అధికారులు నివాళులర్పించారు.

భీమవరం టౌన్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణ లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం పలువురు అధికారులు నివాళులర్పించారు. ఏవో రాజశేఖర్, బీసీ సంక్షేమ శాఖాధికారి జి.గణపతిరావు, ఏఎస్‌డబ్ల్యూ కె. వెంకటేశ్వర రావు, తదితరులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజ భవనంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభి నందనీయమ న్నారు. అత్యవసర వైద్య సేవలు పొందే వారికి రక్తం ఎంతో అవసరమని, దీన్ని అందరూ గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు రావాలని జేసీ సూచించారు. పలుసార్లు రక్తదానం చేసిన సమయమం తుల నానిని జేసీ, సంఘ సభ్యులు సత్కరించారు. జూలూరి వెంకటేశ్, వబిలిశెట్టి వెంకటేశ్వరావు, తటవర్తి బదిరీ నారాయణ, వబిలిశెట్టి కిశోర్, తదితరులు పాల్గొన్నారు.