Share News

ఇండియాదే ‘మాస్టర్స్‌’

ABN , Publish Date - Mar 17 , 2025 | 01:28 AM

అంబటి రాయుడు (74) అదరగొట్టడంతో అంతర్జాతీయ మాస్టర్స్‌ లీగ్‌ (ఐఎంఎల్‌) తొలి సీజన్‌లో ఇండియా మాస్టర్స్‌ విజేతగా నిలిచింది. ఆదివారం వెస్టిండీస్‌ మాస్టర్స్‌తో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో...

ఇండియాదే ‘మాస్టర్స్‌’

చెలరేగిన రాయుడు

ఫైనల్లో విండీస్‌ ఓటమి

రాయ్‌పూర్‌: అంబటి రాయుడు (74) అదరగొట్టడంతో అంతర్జాతీయ మాస్టర్స్‌ లీగ్‌ (ఐఎంఎల్‌) తొలి సీజన్‌లో ఇండియా మాస్టర్స్‌ విజేతగా నిలిచింది. ఆదివారం వెస్టిండీస్‌ మాస్టర్స్‌తో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో సచిన్‌ సేన గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లారా సేన 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. లెండిల్‌ సిమ్మన్స్‌ (57), ఓపెనర్‌ డ్వేన్‌ స్మిత్‌ (45) మాత్రమే రాణించారు. వినయ్‌ కుమార్‌కు మూడు, షాబాజ్‌ నదీమ్‌కు రెండు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత ఛేదనలో ఇండియా మాస్టర్స్‌ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రాయుడు, సచిన్‌ ఆరంభం నుంచే ఎదురుదాడి ఆరంభించారు. ముఖ్యంగా రాయుడు స్ట్రయిక్‌ ఎక్కువగా తీసుకుని భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు.


అటు ఉన్న కాసేపు సచిన్‌ తన మాస్టర్‌ క్లాస్‌ ఆటతీరుతో అభిమానులను అలరించాడు. థర్డ్‌ మ్యాన్‌ దిశగా బాదిన ఓ ఫోర్‌, సిక్సర్‌ చూశాక సచిన్‌లో సత్తా ఏమాత్రం తగ్గలేదనిపించింది. ఎనిమిదో ఓవర్‌లో తను అవుట్‌ కావడంతో తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో ఎండ్‌లో రాయుడు వరుస బౌండరీలతో చెలరేగుతూ 34 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే 15వ ఓవర్‌లో అతడు వెనుదిరిగినా అప్పటికే విజయం ఖాయమైంది. చివర్లో బిన్నీ (16 నాటౌట్‌) దూకుడుతో 17 బంతులుండగానే మ్యాచ్‌ ముగిసింది.

సంక్షిప్త స్కోర్లు

వెస్టిండీస్‌ మాస్టర్స్‌: 20 ఓవర్లలో 148/7 (సిమ్మన్స్‌ 57, స్మిత్‌ 45; వినయ్‌ 3/26, నదీమ్‌ 2/12);

ఇండియా మాస్టర్స్‌: 17.1 ఓవర్లలో 149/4. (రాయుడు 74, సచిన్‌ 25; నర్స్‌ 2/22)

ఇవి కూడా చదవండి..

Virat Kohli On BCCI: తలతిక్క రూల్స్ అవసరమా.. బీసీసీఐపై కోహ్లీ సీరియస్

Australian Grand Prix 2025: ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో సంచలనం.. వరల్డ్ చాంపియన్‌కు షాక్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 17 , 2025 | 01:28 AM

News Hub