ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: పాత కేసులతో టీడీపీ నేతల అరెస్ట్

ABN, Publish Date - May 15 , 2024 | 09:46 AM

Andhrapradesh: నంద్యాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇందులో భాగంగానే డోన్‌లో పాత కేసులతో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్యాపిలి సింగిల్ విండో డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, వీఆర్వో మల్లారెడ్డి, సుబ్బారెడ్డిలను ఎస్సీ, ఎస్టీ కేసులో ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు.

నంద్యాల, మే 15: నంద్యాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో వైసీపీ (YSRCP) నుంచి టీడీపీలో (TDP) చేరిన వారిని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇందులో భాగంగానే డోన్‌లో పాత కేసులతో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్యాపిలి సింగిల్ విండో డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, వీఆర్వో మల్లారెడ్డి, సుబ్బారెడ్డిలను ఎస్సీ, ఎస్టీ కేసులో ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఈ ముగ్గిరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని బనగానపల్లె స్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ (Former MLA Kotla Sujatamma) తీవ్ర అభ్యంతరం తెలిపారు.

TS News: త్వరలో ఎస్ఎల్‌బీసీ సొరంగం తవ్వకం


అరెస్ట్ చేసిన వారిని కోర్టులో ప్రవేశపెట్టాలంటూ డీఎస్పీ కార్యాలయం వద్ద సుజాతమ్మ ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో అరెస్ట్ చేసిన వారిని పోలీసులు బనగాన పల్లె నుంచి డోన్‌కు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం కోట్ల సుజాతమ్మ ఆందోళన చేపట్టకుండా ఇంటి వద్దకు భారీగా కాప్స్ చేరుకున్నారు. డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి (TDP Candidate Kotla Surya prakash Reddy) ఇంటిలోకి వెళ్ళిన సీఐ, ఎస్ఐ.. నిరసన వద్దని తెలిపారు. దీంతో పోలీసులపై కోట్ల సుజాతమ్మ, సూర్య ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కేసులతో అరెస్టు చేయడం ఇది మంచి పద్ధతి కాదని చట్టపరంగానే పోవాలని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సూచించారు.


ఇవి కూడా చదవండి...

AP News: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం.. వేట కొడవళ్లతో విచక్షణారహితంగా..

AP Elections 2024: ఏపీలో చెలరేగిన వైసీపీ మూకలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 09:48 AM

Advertising
Advertising