Share News

దెబ్బతిన్న పంటల పరిశీలన

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:44 AM

పెనుగాలులు తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న వరి పంటలను నంద్యాల ఏడీఏ రాజశేఖర్‌ పరిశీలించారు.

దెబ్బతిన్న పంటల పరిశీలన
నందిపల్లిలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్న ఏడీఏ

మహానంది, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పెనుగాలులు తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న వరి పంటలను నంద్యాల ఏడీఏ రాజశేఖర్‌ పరిశీలించారు. మండలంలోని నందిపల్లి, యి.బొల్లవరం గ్రామాల పరిధిలోని పంట పొలాల్లో నేల వాలిన వరి పంటను సోమవారం ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఏడీఏ మాట్లాడుతూ మరి కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి, మెక్కజొన్నతో పాటు ఇతర పంటల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పడిపోయిన వరి మొక్కలకు కట్టలు కట్టుకోవాలని సూచించారు. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నాగేశ్వరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:44 AM