Srisailam: శ్రీశైలం ఆలయానికి వివాదాల అఘోరీ.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:42 PM
శ్రీశైలంలో ఓ లేడీ అఘోరీ హల్ చల్ చేశారు. అఘోరీ నాగ సాధు కాషాయ వస్త్రాలు ధరించి శ్రీశైలం మల్లన్న ఆలయం వద్దకు వచ్చారు. అఘోరీ గురించి తెలుసుకున్న స్థానికులు, భక్తులు ఆమెను చూసేందుకు పెద్దఎత్తున గుమిగూడారు.
నంద్యాల: శ్రీశైలంలో ఓ లేడీ అఘోరీ హల్ చల్ చేశారు. అఘోరీ నాగ సాధు కాషాయ వస్త్రాలు ధరించి శ్రీశైలం మల్లన్న ఆలయం వద్దకు వచ్చారు. అఘోరీ గురించి తెలుసుకున్న స్థానికులు, భక్తులు ఆమెను చూసేందుకు పెద్దఎత్తున గుమిగూడారు. దీంతో ఆత్మకూర్ డీఎస్పీ రామాంజీ నాయక్ ఎటుంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా భారీ బందోబస్తుతో ఏర్పాటు చేశారు. అఘోరీకి మల్లన్న దర్శనం చేయించారు. అనంతరం ఆమె శ్రీశైలం సమాధుల వద్ద మీడియాతో మాట్లాడారు.
సనాతన ధర్మాన్ని కాపాడాలని అఘోరీ నాగ సాధు హిందువులకు పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు గో హత్యలను నిర్మూలించాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరారు. ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు ఆపాలని సూచించారు. కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలను నేడు దర్శించుకోనున్నట్లు అఘోరీ తెలిపారు. ఆ రెండు ఆలయాల దర్శనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పర్యటన ముగిస్తుందని చెప్పుకొచ్చారు. సోమవారం రోజున తెలంగాణలోని పోచమ్మ ఆలయాన్ని సందర్శించుకుని అనంతరం అటు నుంచి అటే కుంభమేళాకు వెళ్తానని అఘోరీ నాగసాధు వెల్లడించారు.
అయితే ఇటీవల లేడీ అఘోరీ నాగ సాధు తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాల వద్ద హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయం వద్ద ఈనెల 7వ తేదీన ఆమె రచ్చరచ్చ చేశారు. శివాలయంలోకి వెళ్తుంటే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారంటూ ఆమె తన ఒంటిపై, కారుపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఆలయంలోకి అనుతివ్వాలని, శివయ్య దర్శించుకోవాలని గొడవ చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లేడీ ఆఘోరీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమె ఒంటిపై బిందెలతో నీటిని పోశారు. అనంతరం దర్శనం కల్పించి పంపించి వేశారు. అఘోరీ నాగ సాధు ఐఫోన్, లగ్జరీ కారును వాడుతూ అందరి కంటే భిన్నంగా కనిపిస్తున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్‌గా మారారు.
ఈ వార్తలు కూడా చదవండి:
I&PR: డిప్యూటీ సీఎం పర్యటనపై ఐఅండ్ పీఆర్ నిర్లక్ష్యం..
Pawan Kalyan: షర్మిల భద్రతపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు