వైసీపీకి షాక్
ABN , Publish Date - Mar 16 , 2024 | 01:29 AM
బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది.

మాజీ ఎమ్మెల్యే బీసీ సమక్షంలో టీడీపీలో చేరిన 75 కుటుంబాలు
బనగానపల్లె, మార్చి 15: బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. శుక్రవారం కొలిమిగుండ్ల మండల తోళ్లమడుగు, తిమ్మ నాయునిపేట గ్రామాలకు చెందిన 75 కుటుంబాలు వైసీపిని వీడి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. బీసీ వీరికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ సీనియర్ నాయ కుడు ఐవీ ఫక్కీరారెడ్డి, కొలిమిగుండ్ల టీడీపీ నాయకులు అంబటి జయలక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో తోళ్లమడుగు ఎస్సీ కాలనీకి చెందిన శ్రీనివాసులు, పెద్దరాజు, బాలసుంకన్న, సుందరయ్య, శాంతయ్య విష్ణు, కొండపల్లి సురేశ్‌తో సహా 25 కుటుంబాలు, తిమ్మనాయునిపేట గ్రామానికి చెందిన శేషఫణిశెట్టి, హరిబాబుశెట్టి, చిన్నపాపోడు, మహమ్మద్, సిలార్; గంధం కిట్టు, తదితర 50 కుటుంబలు వైసీపీని వీడి బీసీ సమక్షంలో పార్టీలో చేరారు. ఈసందర్భంగా బీసీ జనా ర్దన్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో రాష్ట్రం లో నూతనంగా టీడీపీ, జనసేన. బీజెపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. టీడీపీలో చేరిన అందరికి సము చిత స్థానం కల్పిస్తామన్నారు. టీడీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుప డిందన్నారు. చంద్ర బాబునాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్ర మంలో టీడీపీ శ్రేణులు, బీసీ అభిమానులు పాల్గొన్నారు.
సీఎం ఇంటి పట్టాల గురించి మాట్లాడడం హాస్యాస్పదం: బీసీ
బనగానపల్లె పట్టణంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో సీఎం జగన్ పట్టణానికి సంబంధించిన ఇంటి పట్టాల విషయం ప్రస్తా విం చడం హాస్యాస్పదంగా ఉందని బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ బనగానపల్లె పట్టణంలో ఇంటి పట్టాలకు తాను అడ్డుపడుతున్నానని సీఎం జగన్ మాట్లాడారని, ఆయనకు ఈ విషయం తెలుసా? అని బీసీ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం వైసీపీదే కదా ఎందుకు పట్టాలు ఇప్పించలేకపోయారని సీఎంను బీసీ ప్రశ్నించారు. తాను బనగానపల్లెలోని ఎస్సార్బీసీ బఫర్‌జోన్‌లో పట్టాలు ఇస్తే ఎస్సార్టీసీ కాల్వ కట్ట తెగి అమాయకులు ప్రాణాలు కోల్పోతారని, బఫర్‌జోన్‌లో కాకుండా మిగతా ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇంటిపట్టాలు ఇవ్వాలని తాను కలెక్టరుకు 2022 అక్టోబరులో అఫడవిట్ సమర్పించానని అన్నారు. బఫర్‌జోన్ ప్రాంతంలో వైసీపీ నాయకులు ప్లాట్లను అమ్ముకొని రూ. 2.5 కోట్ల నుంచి రూ.3కోట్ల వరకు ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ముడుపులు తీసుకున్న విషయం సీఎం జగన్‌కు తెలుసా? అని బీసీ ప్రశ్నించారు. వంద పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కనీసం ఆస్పత్రిని కూడా సందర్శించకపోవడం దారుణమన్నారు. ఆస్పత్రికి అవసరమైన డాక్టర్లు గాని, సిటీ స్కాన్‌గాని, ఎంఆర్‌ఐ సౌకర్యం గాని లేకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేదవాడని డబ్బులు లేవని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి, బురానుద్దీన్, గౌండాబాబు, అహమ్మద్‌హుస్సేన్, అబిరుచి మధు, రజాక్, గడ్డం అమరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.