Gottipati Ravi Kumar: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:25 PM
గత ఐదేళ్లలో ఆక్వా రంగం కుదేలు అయిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఈ రంగంపై సరైన దృష్టి పెట్టలేదు. దీంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. తమ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకు వెళ్లాలో కూడా వారికి తెలియ లేదు.
భీమవరం, నవంబర్ 28: ఆక్వా రైతుల సమస్యలపై త్వరలోనే కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను మంత్రి దృష్టికి వారు తీసుకు వెళ్లారు. హేచరీలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని మంత్రిని ఈ సందర్భంగా ఆక్వా రైతులు కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
Also Read: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
లోడ్ అధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. విద్యుత్ సరఫరా అవసరానికి తగినట్లు.. కొత్త సబ్ స్టేషన్లు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ సబ్సిడీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని పలువురు హేచరీల యాజమాన్యాలు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కొరగా.. దీనిపై మంత్రి వెంటనే స్పందించారు.
Also Read: ఆ ప్రాంతాల్లో తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ
హేచరీల యాజమాన్యాలతో అధికారులు సమావేశం కావాలని సూచించారు. వారిపై పెను ఆర్థిక భారం పడకుండా సమస్యను పరిష్కరించేందుకు తనకు సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. మరోవైపు ఆక్వా రైతుల సమస్యలపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చించినట్లు మంత్రి వారికి వివరించారు.
Also Read: ఆందోళన వద్దంటూ రైతులకు కీలక సూచన
గత ఐదేళ్లలో ఆక్వా రంగం కుదేలు అయిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఈ రంగంపై సరైన దృష్టి పెట్టలేదు. దీంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. తమ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకు వెళ్లాలో కూడా వారికి తెలియ లేదు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు.
దీంతో ప్రజల సమస్యలపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. అందులోభాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలతో మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశమై.. వారి సమస్యలపై చర్చిస్తున్నారు. అలా గురువారం భీమవరంలో ఆక్వా రంగానికి చెందిన రైతులతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు.
For AndhraPradesh News And Telugu News