Nara Lokesh: కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్
ABN, Publish Date - Nov 04 , 2024 | 08:39 AM
ఏపీ మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట నివాసం వద్ద ఈ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్య వింటూ పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇస్తుండటంతో ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించేందుకు బారులు దీరుతున్నారు.
అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంగళగిరి ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ( Praja Durbar)కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్‌కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఒపిగ్గా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు. పరిష్కారం కాని సమస్యలను సంబంధిత విభాగాల అధికారులకు పంపి పరిష్కార మార్గం చూపుతున్నారు. తన వద్దకు వచ్చిన ప్రజల కష్టాలు వింటూ...కన్నీళ్లు తుడుస్తూ...! మీ వెంట నేనున్నాంటూ ”ప్రజాదర్బార్” లో లోకేష్ భరోసా ఇస్తున్నారు.
మంగళగిరిలో ప్రజాదర్బార్..
మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గంలో ప్రజాదర్బార్‌లో ఇవాళ(సోమవారం) వేకువ జామునుంచే వినతులను స్వీకరిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. స్థానికంగా అందుబాటులో ఉండే రోజుల్లో ప్రజలను కలవనున్నట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారని ప్రజలంతా ఎదురుచూశారు. అయితే గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయని.. ఏ సమస్య ఉన్న అక్కడ ఫిర్యాదు చేస్తే సరిపోతుందని జగన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని కలిసి సమస్యలు విన్నవించే పరిస్థితి లేకుండా పోయింది. ఏదైనా సమస్యలను నేరుగా తమ ఎమ్మెల్యేకు చెప్పుకుంటే త్వరగా పరిష్కారమవడంతో పాటు.. తమ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని ఆశ పడుతుంటారు. అయితే వైసీపీ ప్రభుత్వం సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ప్రజల సమస్యలు ఎమ్మెల్యేలకు తెలిసేవి కావు. మరోవైపు కొన్ని సమస్యలు పరిష్కారమైతే.. మరికొన్నింటికి పరిష్కారం దొరికేది కాదు.. దీంతో ప్రజలకు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం మొదలైంది. వైసీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయానికి ఇది ఒక కారణమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ప్రజలకు స్వాంతన..
కష్టాల్లో ఉన్నవారి కన్నీరును ఏపీ మంత్రి నారా లోకేష్ తుడుస్తున్నారు. సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ప్రజాదర్బార్ సాగుతోంది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 45 ప్రజాదర్బార్లు నిర్వహించారు. ప్రజల నుంచి 4,753 విజ్ఞప్తులను మంత్రి నారా లోకేష్ స్వీకరించారు. ప్రజాదర్బార్‌లో 2,219 సమస్యలకు పరిష్కారం చూపించారు. విన్నపాల్లో సగానికి పైగా రెవెన్యూ, హోంశాఖకు సంబంధించిన సమస్యలే వస్తున్నాయి. విజ్ఞప్తులను త్వరితగతిన పరిష్కరించడానికి మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుంటున్నారు.
ప్రజాదర్బార్‌తో కష్టాల్లో ఉన్న ప్రజలకు స్వాంతన లభిస్తోంది. వివిధ సమస్యలపై తనని కలవడానికి ఉండవల్లిలోని సీఎం నివాసం వద్దకు వస్తున్న ప్రజలకు యువనేత, మంత్రి నారా లోకేశ్ ‘మీ కష్టాలు తీరుస్తా.. అండగా ఉంటా..’ అంటూ భరోసా ఇస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సమస్యలు చెప్పుకొనేందుకు సీఎం జగన్ నివాసం వద్దకు వెళ్లిన ప్రజలకు నిరాశే ఎదురయ్యేది. కానీ, ఇప్పుడు ఎటువంటి ఆంక్షలు లేకుండానే నేరుగా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకుని లోకేశ్‌కు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఆంక్షలు విధించకుండా లోపలికి పంపించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను సావధానంగా వింటున్న యువనేత వారందరికీ మనోధైర్యాన్నిస్తూ అండగా ఉంటానని మంత్రి నారా లోకేశ్ భరోసా ఇస్తున్నారు.
ప్రజా పాలన..
వైసీపీ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో పూర్తిగా ఓట్ల రాజకీయానికి శ్రీకారం చుట్టిందనే విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య దూరం పెరిగింది. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. గత అనుభవాల దృష్ట్యా నిజమైన ప్రజాపాలన అందించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి ప్రతి సమస్యను సకాలంలో పరిష్కరిస్తామని కూటమి ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే కొన్ని రోజుల్లోనే కొత్త ప్రభుత్వ పాలనలో స్పష్టమైన తేడా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వారి కోసమే రెడ్‌బుక్.. హోం మంత్రి
84 వేల కోట్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 04 , 2024 | 09:46 AM