ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Ministers: సోమశిల ప్రాజెక్ట్ పనులపై వైసీపీని నిలదీసిన ఏపీ మంత్రులు

ABN, Publish Date - Aug 10 , 2024 | 03:27 PM

వైసీపీ ప్రభుత్వంలో చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలతో కలసి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే, ఆ పనులను పూర్తి చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 80 శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమేనని వెల్లడించారు. సోమశిలకు వరద వచ్చి సోమేశ్వర ఆలయం కొట్టుకుపోతే, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.

Anam Ramanarayana Reddy

నెల్లూరు: సోమశిల ప్రాజెక్ట్ హైలెవల్ కెనాల్ పనులను జగన్ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) ప్రశ్నించారు. కాంట్రాక్టర్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయకుండా పారిపోయారని ఆరోపించారు. శనివారం నాడు జెడ్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం సోమశిల పనులు చేయలేదు కాబట్టే, తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వంలో చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని అన్నారు.


ఎమ్మెల్యేలతో కలసి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే, ఆ పనులను పూర్తి చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 80 శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమేనని వెల్లడించారు. సోమశిలకు వరద వచ్చి సోమేశ్వర ఆలయం కొట్టుకుపోతే, వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉద్ఘాటించారు.


వలంటరీ వ్యవస్థతో పనిలేకుండానే ఫించన్లు...

అభివృద్ధి, పనులు చేసిన వారిని ప్రజలు మరచిపోరని అన్నారు. అభివృద్ధి చేస్తే ప్రజలు పట్టం కడతారని అనడానికి తానే నిదర్శనమని గుర్తుచేశారు. పెన్షన్ల పంపిణీ వలంటరీ వ్యవస్థ ఉంటేనే సాధ్యమవుతుందని జగన్ ప్రభుత్వంలో చెప్పారని.. కానీ కూటమి ప్రభుత్వంలో వలంటరీ వ్యవస్థతో పనిలేకుండానే ఫించన్లు పంపిణీ చేసి చూపించామని గుర్తుచేశారు. సినరీస్ సెస్‌ను బలోపేతం చేసి స్థానిక సంస్థలకు నిధులు వచ్చేలా చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.

వచ్చే ఐఏబీ సమావేశంలోపు పూర్తి స్థాయిలో ఆయకట్టు వివరాలు సేకరిస్తామని తెలిపారు. పోలవరాన్ని త్వరలో పూర్తి చేసి ఏపీని సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో అన్నమయ్య డ్యామ్, సోమశిల డ్యామ్ కింది భాగాలు కొట్టుకుపోతే దిక్కులేకుండా పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు ఇంకా రెండున్నారేళ్లు సమయం ఉందని... రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తామని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి వెల్లడించారు.


పనులు చేయకుండా బిల్లుల వసూళ్లు: మంత్రి నారాయణ

వైసీపీ ప్రభుత్వం సోమశిల హైలెవల్ కెనాల్ పనులను నిలిపివేసిందని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. శనివారం నాడు జెడ్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. జిల్లాలో అన్ని సమస్యలపై చర్చించామని అన్నారు. 1950 ఆయకట్టు ఆధారంగానే నీటి విడుదల జరుగుతుందని తెలిపారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లాలో స్టిల్ తీయకుండానే బిల్లులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని.. వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


మూడు లక్షల ఎకరాలు బీడు: ఎమ్మెల్యే సోమిరెడ్డి

కండలేరు ఆయకట్టు 2.20 లక్షల ఎకరాలు 2019 వరకు ఉండగా, గత ఐదేళ్లలో ఒక్క ఎకరానికి కూడా ఆయకట్టు పెరగలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తెలిపారు. గతేడాది రైతులు మూడు లక్షల ఎకరాల పొలాలను బీడుగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లస్కర్లకు జీతాలు లేవని, కాలువల్లో పూడికలు, బురద తీయలేదని చెప్పారు. జనవరిలో సర్వేపల్లిలో పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. గ్రామాల్లో పనులు చేశారో, లేదో రైతులనే అడగాలని కలెక్టర్‌ని కోరారు. రెండేళ్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆరు నెలలకి ఎందుకు తగ్గించారు? అని ప్రశ్నించారు. రైతుల ఊసురు పోసుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని మండిపడ్డారు. చెరువులో కట్టిన జగనన్న కాలనీల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని అన్నారు. రైతులను వేధించి, హింసించి, బాధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రాఫిక్ కష్టాలు.. పోలీసుల సరికొత్త ప్రయోగం..

ఆదివాసీ దినోత్సవంలో గిరిజనులతో సీఎం చంద్రబాబు..

ఏపీ మహిళలకు శుభవార్త...

దమ్ముంటే చంపు.. బయటకు రా..: దువ్వాడ వాణి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 10 , 2024 | 04:01 PM

Advertising
Advertising
<