ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం.. కారణమిదే..

ABN, Publish Date - Nov 03 , 2024 | 04:08 PM

జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. స్వాగత కార్యక్రమంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేశారు. ఈ వేదికపై ఎంపీ వేమిరెడ్డి ఉన్నప్పటికీ అధికారులు విస్మరించారు.

నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ(ఆదివారం) కూటమి పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఏపీ మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది.


స్వాగత కార్యక్రమంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేశారు. ఈ వేదికపై ఎంపీ వేమిరెడ్డి ఉన్నప్పటికీ అధికారులు విస్మరించారు. గౌరవం లేని చోట ఉండనంటూ సమావేశ వేదికపై నుంచి దిగి ఎంపీ వేమిరెడ్డి వెళ్లిపోయారు. అందరి తరపున వేమిరెడ్డిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి క్షమాపణ కోరారు. అధికారుల తీరుపై మంత్రి ఆనం సీరియస్ అయ్యారు. మరోసారి పొరపాటు జరగకుండా చూడాలని కలెక్టర్‌కు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


నామినేటెడ్ పదవులు, సభ్యత్వ నమోదుపై దృష్టి: ఆనం రామనారాయణరెడ్డి

నెల్లూరు: నామినేటెడ్ పదవులు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై దృష్టి సారించామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ... టీడీపీ, బీజేపీ, జనసేన జిల్లా సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.


జిల్లా అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో నీటి సంఘాల ఎన్నికలు పార్టీ నామినేటెడ్ పోస్టులపై ప్రధానమైన చర్చ సాగిందని అన్నారు. మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ, పాత ఫార్ములాతోనే ముందుకెళ్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.


సోమశిల, కండలేరు జలాశయాల అభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి మహమ్మద్ ఫరూక్

నెల్లూరు జిల్లాతో తనకు కొన్నేళ్లుగా అనుబంధం ఉందని ఏపీ మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్ తెలిపారు. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్‌పై చర్చ జరిగిందని అన్నారు. అధిష్టానం దృష్టికి జిల్లా సమస్యలను తీసుకెళ్తామని వివరించారు. సోమశిల, కండలేరు జలాశయాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. 30 శాతం వరకు వృథా అవుతున్న సాగునీటిని దశలవారీగా అరికడతామని మంత్రి మహమ్మద్ ఫరూక్ చెప్పారు.


ఆ బ్రిడ్జి పనులకు ప్రతిపాదనలు పంపించాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: డీఆర్సీ మీటింగ్‌లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పొట్టేపాలెం కలజు మీద బ్రిడ్జి పనులు మంజూరు చేసేందుకు అధికారులు వెంటనే ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. నెల్లూరు రూరల్‌లో మూడు బ్రిడ్జిల పనులను యుద్ధప్రాతిపదికన చేయాలని అధికారులను ఆదేశించారు. మంచి ప్రభుత్వం అధికారంలో ఉందని... అధికారులు సమన్వయం చేసుకుని పనులు చేయాలని సూచించారు. జగన్ ప్రభుత్వంలో మూడు బ్రిడ్జిల పనులు మంజూరైనా.. వైసీపీ నుంచి తాను బయటకు రావడంతో ఈ పనులను నిలిపివేశారని చెప్పారు. గతంలో కొమ్మాలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరయ్యాయని.. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ పనులను నిలిపేసిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Politics: చంద్రబాబు.. ప్రజా ముఖ్యమంత్రి

AP Politics: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో భారీ కుంభకోణం

For More AndhraPradesh News And Telugu News..

Updated Date - Nov 03 , 2024 | 04:36 PM