ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nellore: నెల్లూరు జిల్లాలో నకిలీ పోలీసులు హల్‌చల్.. పుదుచ్ఛేరి వాసులను బెదిరించి..

ABN, Publish Date - Sep 21 , 2024 | 01:02 PM

నెల్లూరు జిల్లాలో సినిమా లెవల్‌లో చోరీ జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం పుద్దుచ్ఛేరికి చెందిన ఓ కుటుంబం జిల్లాలో పొలం కొనుగోలు చేసేందుకు ముత్తుకూరు గ్రామానికి బయలుదేరారు.

నెల్లూరు: జిల్లాలో నకిలీ పోలీసులు రెచ్చిపోయారు. పోలీసులమంటూ చెప్పి పుదుచ్ఛేరి వాసుల నుంచి లక్షలు కాజేసి పరారయ్యారు. పొలం కొనేందుకు వచ్చిన వారిపై బెదిరింపులకు పాల్పడి నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుల కోసం జిల్లా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


అసలేం జరిగిందంటే..?

నెల్లూరు జిల్లాలో సినిమా లెవల్‌లో చోరీ జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం పుద్దుచ్ఛేరికి చెందిన ఓ కుటుంబం జిల్లాలో పొలం కొనుగోలు చేసేందుకు ముత్తుకూరు గ్రామానికి బయలుదేరారు. అయితే పెద్దఎత్తున నగదు తీసుకువస్తున్నారని ముందుగానే తెలుసుకున్న కొంతమంది దుండగులు పథకం రచించారు. వారి వద్ద ఉన్న రూ.50లక్షలు కొట్టేసేందుకు నకిలీ పోలీసుల అవతారం ఎత్తారు.


బాధిత కుటుంబం ముత్తుకూరు గ్రామ సమీపానికి రాగానే ముందస్తు పథకం ప్రకారం కారును ఆపారు. అనంతరం వారిని భయాందోళనలకు గురి చేసి వారి వద్ద ఉన్న రూ.50లక్షలు ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించి బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ కృష్ణకాంత్, నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నకిలీ పోలీసుల ముఠా కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చెన్నై విమానాశ్రయంలో ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Visakha: రెచ్చిపోయిన కామాంధుడు.. భీమిలిలో మరో దారుణ ఘటన..

Buddha Venkanna: ఆ విషయం డైవర్ట్ చేసేందుకు విజయసాయిరెడ్డి ట్వీట్లు: బుద్దా వెంకన్న..

Gas leak: గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు..

Updated Date - Sep 21 , 2024 | 01:03 PM