AP Politics: నెల్లూరులో వైసీపీకి భారీ షాక్... టీడీపీలోకి వేమిరెడ్డి
ABN, Publish Date - Mar 02 , 2024 | 01:42 PM
Andhrapradesh: ఎన్నికల ముందు అధికార పార్టీ వైఎస్సార్సీపీకి జిల్లాలో భారీ షాక్ తగిలింది. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి దంపతులు తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వేమిరెడ్డితో పాటు వైసీపీ నేతలు టీడీపీలో భారీగా చేరారు.
నెల్లూరు, మార్చి 2: ఎన్నికల ముందు అధికార పార్టీ వైఎస్సార్సీపీకి (YSRCP) జిల్లాలో భారీ షాక్ తగిలింది. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (MP Vemireddy Prabhakar Reddy) టీడీపీలో (TDP) చేరారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సమక్షంలో వేమిరెడ్డి దంపతులు తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వేమిరెడ్డితో పాటు వైసీపీ నేతలు టీడీపీలో భారీగా చేరారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్, మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
టీడీపీ చేరడం సంతోషం: వేమిరెడ్డి
ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటానని ఎంపీ వేమిరెడ్డి అన్నారు. మరింతమందికి సేవ చేయాలనే రాజకీయాల వైపు అడుగేశానని తెలిపారు. టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ‘‘భవిష్యత్‌లో మీ అందరి మద్దతు నాకు అవసరం. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తా’’ అని వేమిరెడ్డి వెల్లడించారు.
Gaddam Prasad: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
నెల్లూరు పార్లమెంట్ మనదే...: చంద్రబాబు
నెల్లూరు పార్లమెంటు స్థానం ఇక మనకే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా ఖాళీ అయిపోతోందని.. నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేషనే ఖాళీ అయిపోతోందని తెలిపారు. యుద్ధానికి సై అంటూ అంతా ముందుకు వస్తున్నారన్నారు. న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అని కొనియాడారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే నేతలను ఎప్పడూ స్వాగతిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి టీడీపీలోకి రావడం శుభపరిణామమన్నారు. రాజకీయాల్లో సంపాదించాలని, దుర్మార్గపు పనులు చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు. వీపీఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండటం అవసరమన్నారు. సొంత డబ్బు ప్రజలకి ఖర్చుపెట్టే మనస్థత్వం వీపిఆర్ ది అని... డిప్యూటీ మేయర్ రూప్ కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని టీడీపీ చీఫ్ తెలిపారు.
జగన్ ఓ సైకో...
‘‘జగన్ ఒక సైకో. మనమంతా బానిసలం, ఆయనేమో రాజు. ఎవరైనా ప్రశ్నిస్తే వేధించడం. నువ్వు చేస్తానన్న పనులు ఎందుకు చేయవని ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రశ్నిస్తే వేధించారు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోమని కోటంరెడ్డి పోరాడారు. అహంకారంతో ఇష్టానుసారంగా విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. 5 కోట్ల ఆంధ్రుల కోసం, యువత భవిష్యత్తు కోసం, పుట్టబోయే బిడ్డల కోసం అందరూ ఆలోచించాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Mallareddy: నన్ను కావాలనే కొంతమంది టార్గెట్ చేశారు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 02 , 2024 | 02:58 PM