Perni Nani: రోజు రోజుకీ రెచ్చిపోతున్న పేర్ని నాని అనుచరులు | Perni Nani followers attack on Janasena leader PVCH
Share News

Perni Nani: రోజు రోజుకీ రెచ్చిపోతున్న పేర్ని నాని అనుచరులు

ABN , Publish Date - Mar 28 , 2024 | 10:42 AM

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని అనుచరులు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. మొన్న ఉల్లిపాలెంలో ఓ టీడీపీ సానుభూతిపరుడిపై దాడి జరిగింది. నేడు జనసైనికుడిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.

Perni Nani: రోజు రోజుకీ రెచ్చిపోతున్న పేర్ని నాని అనుచరులు

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి, వైసీపీ (YSRCP) కీలక నేత పేర్ని నాని (Perni Nani) అనుచరులు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. మొన్న ఉల్లిపాలెంలో ఓ టీడీపీ (TDP) సానుభూతిపరుడిపై దాడి జరిగింది. నేడు జనసైనికుడిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఫేస్‌బుక్‌ (Facebook)లో వైసీపీ వ్యతిరేక పోస్టులు పెడుతున్న జనసైనికుడు తోట యశ్వంత్‌పై పేర్ని నాని మనుషులు దాడి చేశారు. పేర్ని నాని సమక్షంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. జడ్పీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పెళ్లి వేడుకకు పేర్ని నాని తన అనుచరులతో హాజరయ్యారు.

Chandrababu: ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేడు చంద్రబాబు ‘ప్రజాగళం’

ఈ క్రమంలోనే జనసేన నేత తోట యశ్వంత్.. పేర్ని నాని అనుచరులకు తారసపడటంతో మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేసిన తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీస్ స్టేషన్‌లోనూ యశ్వంత్ పై దాడికి పాల్పడినట్టు సమాచారం. పోలీస్ స్టేషన్ కు పెద్ద సంఖ్యలో జనసైనికులు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న యశ్వంత్ ని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర (Kollu Ravindra), నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ పరామర్శించారు. కొల్లు రవీంద్ర, బండి రామకృష్ణ దాడిని తీవ్రంగా ఖండించారు.

AP Elections: ఓటమి భయంతో అబద్ధాలు.. అడ్డంగా దొరికిపోయిన జగన్..!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Mar 28 , 2024 | 10:42 AM