AP NEWS: చెవిరెడ్డి నువ్వో చీటర్...బాలినేని సంచలన కామెంట్స్
ABN, Publish Date - Nov 25 , 2024 | 05:04 PM
సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతల్లో ఏ ఒక్కరికి లేదని అన్నారు. సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఒంగోలు: వైసీపీ నేత చెవి రెడ్డి భాస్కర్ రెడ్డికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ స్థాయి ఏందీ అని ప్రశ్నించారు. అధికారంలో ఉండగా ఒంగోలు జిల్లాల్లో ఆర్టీసీ సైట్లను తీసుకున్నవా లేదా అని నిలదీశారు. ఇవాళ(సోమవారం) ఏబీఎన్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా పని చేస్తూ కందుకూరు, సంత నూతల పాడు నియోజకవర్గాల్లో చెవిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు బయటకు తీయమంటావా అని ప్రశ్నించారు. చెవిరెడ్డిది చిత్తూరు జిల్లా అయ్యి ఉండి కూడా ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అండతో చేసిన బాగోతాలు ప్రజలకు తెలుసునని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదని.. విజయమ్మ , షర్మిల కూడా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించారు.
వాళ్ల కుటుంబానికి తాను ఎప్పుడు విధేయుడినేనని చెప్పారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతల్లో ఏ ఒక్కరికి లేదని అన్నారు. సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీలో తాను మంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్‌లో నిర్ణయం కోసం అర్ధరాత్రి ఫైల్ పంపి సైన్ చేయమన్నారని చెప్పారు. కేవలం మంత్రి వర్గం చర్చ కోసం అనుకోని సైన్ చేశానని చెప్పారు. ఎవరు ఎవరి మెప్పు కోసం పని చేస్తారో అందరికీ తెలుసునని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
విద్యుత్ ఒప్పందాల్లో ఆరోపణలు...
విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వారిపై అమెరికాలోని న్యాయ స్థానం అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను నాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఏపీ విద్యుత్ శాఖకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP NEWS:అదానీ స్కాంలో.. జగన్‌పై గోనే ప్రకాశరావు సంచలన ఆరోపణలు
Kollu Ravindra: వైసీపీలో వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు... మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
Read Latest AP News and Telugu News
Updated Date - Nov 25 , 2024 | 05:12 PM