ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sajjala Ramakrishnareddy: వలంటీర్ల చుట్టూ తిరుగుతున్న సజ్జల ..

ABN, Publish Date - Apr 11 , 2024 | 01:53 PM

వైసీపీ నేతల రాజకీయమంతా వలంటీర్ల చుట్టే తిరుగుతోంది. ఇటీవల వలంటీర్ల వ్యవస్థ అలాగే ఉంటుందని.. వారి విషయంలో తమ ప్రభుత్వం వచ్చినా కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. అప్పటి నుంచి వైసీపీ నేతలకు గొంతులో వెలక్కాయ పడినట్టు అయ్యింది.

అమరావతి: వైసీపీ నేతల రాజకీయమంతా వలంటీర్ల చుట్టే తిరుగుతోంది. ఇటీవల వలంటీర్ల వ్యవస్థ అలాగే ఉంటుందని.. వారి విషయంలో తమ ప్రభుత్వం వచ్చినా కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) చెప్పారు. అప్పటి నుంచి వైసీపీ నేతలకు గొంతులో వెలక్కాయ పడినట్టు అయ్యింది. ఇక అంతే.. వలంటీర్లను చంద్రబాబుకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలనే ధృడ సంకల్పంతో రాజకీయమంతా వారి చుట్టూనే తిప్పుతున్నారు. నేడు సకల శాఖల మంత్రిగా పేరుగాంచిన సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నిజంగానే అబద్ధపు హామీలు ఇస్తున్నారనడానికి వలంటీర్లకు ఇస్తున్న హామీలే నిదర్శనమన్నారు.

Kothakota Srinivas: ఫోన్‌ ట్యాపింగ్‌పై హైదరాబాద్ సీపీ తొలి రియాక్షన్..


వలంటీర్లు ఉద్యోగం గోనే సంచులు మోసే ఉద్యోగమని చంద్రబాబు అన్నారని సజ్జల తెలిపారు. చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యలు ఎలా మర్చి పోతారంటూ వలంటీర్లనుర ెచ్చగొట్టే పనిలో పడ్డారు. వలంటీర్లను తీసేసి.. జన్మభూమి కమిటీలను మళ్ళీ తీసుకు వస్తారన్నారు. గొడవలు మొదలు పెట్టింది టీడీపీ అని.. అక్కడ ఏదైనా జరిగితే ఆ నింద మా మీద వేస్తున్నారన్నారు. రేపు వచ్చే తీర్పు కోసం టీడీపీ సాకులు వెదుకుతోందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక తమ పైనే ఎక్కువ కేసులు పెట్టారన్నారు. తమ అభ్యర్థులను ఎందుకు మారుస్తామని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, జనసేనలో గందరగోళం ఉందని సజ్జల పేర్కొన్నారు.

AP Elections: పాల‌కొండ‌ను పాలించేదెవ‌రు..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 01:53 PM

Advertising
Advertising