ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Police : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

ABN, Publish Date - Dec 27 , 2024 | 05:38 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఈ నెల 19న సాగి తులసి ఇంటికి ‘పార్శిల్‌లో మృతదేహం డోర్‌ డెలివరీ’ అయిన కేసులో పదేళ్ల చిన్నారి పాత్ర కూడా ఉందన్న విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది.

  • ‘పార్శిల్‌ మృతదేహం’ కేసులో విస్తు గొలిపే నిజాలు

  • పర్లయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీధర్‌వర్మ

  • సహకరించిన మూడో భార్య, కుమార్తె

  • నేడు మీడియాకు వెల్లడించనున్న ఎస్పీ

భీమవరం క్రైం/ఉండి డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఈ నెల 19న సాగి తులసి ఇంటికి ‘పార్శిల్‌లో మృతదేహం డోర్‌ డెలివరీ’ అయిన కేసులో పదేళ్ల చిన్నారి పాత్ర కూడా ఉందన్న విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. జరిగిన సంఘటనలను బట్టి చూస్తే.. తులసి ఆస్తిని కొట్టేయాలన్న కుట్రలో శ్రీధర్‌వర్మ, అతడి ఇద్దరు భార్యల క్రూరమైన నేర స్వభావం తేటతెల్లమవుతుండగా, ఈ హత్యలో మూడో భార్య కుమార్తె అయిన.. పదేళ్ల బాలిక పాత్ర కూడా ఉందంటూ పోలీసులు ఆ చిన్నారిని నిందితురాలి జాబితాలో చేర్చడం గమనార్హం. ఈ కేసులో జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి శుక్రవారం నిందితుల అరెస్ట్‌ చూపించి.. పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. కాగా, శ్రీధర్‌వర్మ తల్లిదండ్రులు కాళ్ల మండలం కోపల్లెలో చెరువులపై పనిచేస్తూ అక్కడే జీవిస్తుంటారు. అతడి మొదటి భార్య ఎలిజబెత్‌ రాణి గాంధీనగర్‌లో ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. రెండో భార్య రేవతికి పిల్లలు లేరు. ఆమెను మొగల్తూరులో ఉంచాడు. మూడో భార్యగా చెబుతున్న సుష్మకు పదేళ్ల కుమార్తె ఉంది. ఆమెను కాళ్ల పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఒక ఇంట్లో ఉంచినట్లు తెలిసింది. వీరితోపాటు రెండో భార్య రేవతి.. తన అక్క తులసి ఆస్తిని కాజేయాలని ప్లాన్‌లో ఉండడంతోనే భర్తకు సహకరించేదని సమాచారం.


  • పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి..

మృతదేహాన్ని పార్శిల్‌ చేసి పంపిన వెంటనే శ్రీధర్‌వర్మ పరారైన విషయం తెలిసిందే. అయితే శ్రీధర్‌వర్మే నిందితుడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు అతడి కోసం గాలించగా.. కొన్ని సీసీ కెమెరాల్లో కనబడినట్లుగా కనిపించి, ఆ రూట్లలో కాకుండా మరో రూట్లలో వెళుతూ పోలీసులను దారి మళ్లించాడు. నాలుగు రోజులపాటు ముప్పుతిప్పలు పెట్టిన అనంతరం కృష్ణా జిల్లా బంటుమిల్లి వద్ద పోలీసులకు దొరికేశాడు. విచారణలో భాగంగా నిందితుడు శ్రీధర్‌వర్మను హత్య జరిగినట్లు భావిస్తున్న ఉండి మండలం వాండ్రం రహదారి వైపుకు గురువారం తీసుకువెళ్లారు. అతడి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరిని భీమవరం, ఆకివీడు, కాళ్ల, ఉండిలలో రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కాళ్ల గ్రామ శివారు గాంధీ నగర్‌లో శ్రీధర్‌ వర్మ మొదటి భార్య వద్ద ఉండేవాడు. పోలీసుల దర్యాప్తులో ఆ నివాసంలో కొన్ని క్షుద్రపూజలకు ఆనవాళ్ళు దొరకడంతో స్థానికుల్లో భయాందోళనకు గురవుతున్నారు. పర్లయ్యను కిరాతకంగా హత్య చేసి పార్శిల్‌ చేసిన శ్రీధర్‌వర్మను ఉరి శిక్ష వేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 05:39 AM