ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: దళితులకు అన్యాయం చేస్తున్న సీఎం జగన్: సోమిరెడ్డి

ABN, Publish Date - Apr 03 , 2024 | 10:45 PM

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్, మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి లపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ మద్యపాననిషేధం తెచ్చి ఓటు అడుగుతానని అన్నాడని ఆయన చెప్పిన మాటలు వట్టివేనని అన్నారు.

నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్, మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి లపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ మద్యపాననిషేధం తెచ్చి ఓటు అడుగుతానని అన్నాడని ఆయన చెప్పిన మాటలు వట్టివేనని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 188 మంది దళితులు హత్యలకి గురయ్యారని.. 6వేల మంది మీద కేసులు పెట్టారని మండిపడ్డారు. దళితులని చంపిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని సీఎం తిరుగుతున్నారన్నారు. సర్వేపల్లిలో మంత్రి గోవర్థన్‌రెడ్డి నిర్వాకం వల్ల కంటైనర్ టెర్మినల్ వెళ్లిపోయిందని చెప్పారు. సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో దళితులని వైసీపీ నేతలు హతమార్చారని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం మాట్లాడే మాటలు గుండెను హత్తుకుంటాయని చెప్పారు.

Devineni Uma: ప్రచారానికి వచ్చి టీడీపీ కార్యకర్తలపై దాడి అమానుషం

రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే చంద్రబాబు పాలననే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీ తీరు వల్లే పెన్షన్లపై ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ డబ్బు పంచుతూ వైసిపీ కార్యకర్తల్లాగా వలంటీర్లని వైసీపీ వాడుకుందని అన్నారు. ఈ విషయంలో ఆరుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లకి ఎలక్షన్ కమిషన్ వాత పెట్టిందన్నారు. జగన్ కాళ్ల కింద వ్యవస్థలు నలిగిపోతున్నాయని చెప్పారు. టన్ను క్వాడ్జికి రూ. 7 వేలు, టన్ను సిలికాకు రూ. 12 వేలు చొప్పున తాడేపల్లికి చేరుతున్నాయన్నారు. జగన్, ఇరిగేషన్, అగ్రికల్చర్ మంత్రులకి వ్యవసాయం మీద అవగాహన లేదన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ దృష్టికి ఏమి తీసుకెళ్లిన వృథానేనని ఆయనకంటే బిల్లు కలెక్టర్ మేలని ఎద్దేవా చేశారు. సర్వేపల్లిలో పోలీసులు టీడీపీ సానుభూతిపరులని భయపెడుతున్నారని చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు తామే గెలుస్తున్నామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. తెనాలి పర్యటన రద్దు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 10:47 PM

Advertising
Advertising