Share News

AP News: ఏపీ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ

ABN , Publish Date - Sep 11 , 2024 | 11:10 AM

ఏపీ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. పూర్తిగా నీటమునిగిన ఇళ్లకు రూ.20 నుంచి 25 వేలు రూపాయలు అందించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

AP News: ఏపీ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ

అమరావతి: ఏపీ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. పూర్తిగా నీటమునిగిన ఇళ్లకు రూ.20 నుంచి 25 వేలు రూపాయలు అందించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ మాదిరిగా మునిగిన ఇళ్లకు రూ.10 వేలు ఇచ్చే యోచన ఉన్నట్టు సమాచారం. మోటార్ సైకిళ్ల మరమ్మతులకు రూ.3 వేలు, ట్యాక్సీలకు రూ.10 వేలు చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై అధికారుల ప్రతిపాదనలను పరిశీలించి ఒక నిర్ణయానికి ప్రభుత్వం రానుంది. ఆర్థిక సాయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


ఏపీని వర్షాలు, వరదలు వణికించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. చాలా మంది జనాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇళ్లన్నీ నీటమునిగాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇలా వర్షాలు, వరదలతో నష్టపోయిన విజయవాడ ప్రజలకు ఊరటనిచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఈ ప్యాకేజీని అందజేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకూ తుది నిర్ణయం అయితే ఇంకా తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది.


ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వరద నష్టం అంచనాలు, ఆర్థిక సాయంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఒక ప్రాథమిక అంచనా అయితే ప్రభుత్వం వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కమిటీ సైతం ఒకట్రెండు రోజుల్లో వరద నష్టంపై నివేదికను వెలువరించనుంది. వరద బాధితులతో పాటుగా రైతుల్ని కూడా ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుని.. వీలైనంత త్వరగా వారికి సాయం అందజేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విజయవాడలోని పలు కాలనీల్లో వరద దాదాపుగా తగ్గిపోయింది. అయితే ఇళ్లను మాత్రం బురద వీడటం లేదు. దానిని ఫైరింజన్ల సాయంతో తొలిగించేస్తున్నారు.

Updated Date - Sep 11 , 2024 | 11:10 AM