ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS:శ్రీకాకుళం జిల్లాలో కలకలం.. టీడీపీ కీలక నేత హత్యకు కుట్ర

ABN, Publish Date - Dec 17 , 2024 | 10:45 AM

పలాసలో టీడీపీ నేత హత్య కోసం బీహార్‌ గ్యాంగ్‌కు సుపారీ ఇవ్వడం కలకలం రేపుతోంది. వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేశారు. అమాయకుల భూములపై లిటిగేషన్లు పెట్టి మధ్యవర్తిత్వం వహించి భారీగా డబ్బులు గుంజారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి.. అప్పనంగా అమ్మేశారు.

శ్రీకాకుళం: పలాసలో బీహార్ సుఫారీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బుడ్డ నాగరాజు హత్యకు కుట్ర పన్నారు. రూ.10 లక్షలకు బీహారీ గ్యాంగ్‌కు స్థానిక వైసీపీ నేతలు సుఫారీ ఇచ్చారు. ఇటీవల టెక్కలిలో 11 మంది బీహార్ అనుమానితులను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. బీహార్ గ్యాంగ్ విచారణలో టీడీపీ నేత హత్య కుట్ర బయటపడింది. చిన్నబాడాంకు చెందిన వైసీపీ కార్యకర్తలు కూర్మాపు ధర్మారావు, అంపోలు శ్రీవాసరావులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఆదివారం రాత్రి విచారణ నిమిత్తం ఇద్దరినీ పోలీసులు తీసుకెళ్లినట్లు సమాచారం. వారికి మద్దతుగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన చేపట్టారు. బడ్డ నాగరాజును హతమార్ఛేందుకు ధర్మారావు, శ్రీనివాసరావులు హ్యూహం రచించారు. సుఫారీ గ్యాంగ్ వ్యవహారాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.


బీహార్‌ గ్యాంగ్‌కు సుపారీ..

పలాసలో టీడీపీ నేత హత్య కోసం బీహార్‌ గ్యాంగ్‌కు సుపారీ ఇవ్వడం కలకలం రేపుతోంది. వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేశారు. అమాయకుల భూములపై లిటిగేషన్లు పెట్టి మధ్యవర్తిత్వం వహించి భారీగా డబ్బులు గుంజారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి.. అప్పనంగా అమ్మేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఆగడాలు సాగడం లేదు. దీంతో బీహార్‌ రాష్ట్రానికి చెందిన గ్యాంగ్‌ను రంగంలోకి దించి.. టీడీపీ పట్టణ అధ్యక్షుడిని అంతమొందిచేందుకు పథకం వేశారు. ఆ ప్లాన్‌ బెడిసికొట్టి.. టెక్కలి పోలీసులకు బీహార్‌ గ్యాంగ్‌ దొరకడంతో వాస్తవాలు బయటపడ్డాయి. వారిచ్చిన సమాచారం మేరకు ఇద్దరి వైసీపీ నాయకులు, పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. కాగా తమ పార్టీ వాళ్లను పోలీసులు, టీడీపీ నాయకులు కిడ్నాప్‌ చేశారంటూ మాజీమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆదివారం రాత్రి కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌ వద్ద ఆందోళన చేయడం చర్చనీయాంశంగా మారింది.


చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: మంత్రి అచ్చెన్నాయుడు

టీడీపీ నేత బుడ్డ నాగరాజు హత్యకు కొంతమంది కుట్ర పన్నారనే విషయం తెలియడంతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హత్యారాజకీయాలు ప్రోత్సహించేది. అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పద్ధతి కొనసాగిస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దీని వెనుక ఎంతటివారు ఉన్నా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఇలాంటి హత్యారాజకీయాలు తావు ఉండకూడదని అచ్చెన్నాయుడు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

YSRCP : సజ్జల భార్గవ్‌ కేసుల వివరాలన్నీ ఇవ్వండి

Political Conflict : వైసీపీ నేతల ఆగడాలు అడ్డుకోండి

AP Skill Development : ఏపీలో 532 స్కిల్‌ హబ్‌లు

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 17 , 2024 | 10:52 AM