ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sunitha: ఆ తరువాతే వివేకా ఓటు ఓటర్ లిస్ట్‌లోనే లేకుండా పోయింది..

ABN, Publish Date - Apr 06 , 2024 | 12:40 PM

మాజీ మంత్రి వివేకా మర్డర్‌పై ఆయన కూతురు సునీతా రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. జస్టిస్‌ ఫర్‌ వివేకా పేరుతో సునీత ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2009లో వైఎస్‌ మరణం తర్వాత పరిణామాలను వివరించారు. కడప స్థానాన్ని అవినాష్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి పాలయ్యారన్నారు. వెన్నుపోటుతో వివేకాను ఓడించారన్నారు.

హైదరాబాద్: మాజీ మంత్రి వివేకా (YS Viveka) మర్డర్‌పై ఆయన కూతురు సునీతా రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. జస్టిస్‌ ఫర్‌ వివేకా పేరుతో సునీత ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2009లో వైఎస్‌ మరణం తర్వాత పరిణామాలను వివరించారు. కడప స్థానాన్ని అవినాష్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి పాలయ్యారన్నారు. వెన్నుపోటుతో వివేకాను ఓడించారన్నారు. ఆ తరువాత కూడా జిల్లా అంతా వివేకా చూసుకున్నారన్నారు. పులివెందులను మాత్రం ఎంపీ అవినాష్‌ కుటుంబానికి అప్పగించారన్నారు. పులివెందులలో అవినాష్‌ కుటుంబం వెన్నుపోటుతో వివేకా ఓడిపోయారన్నారు. ఓటమి తర్వాత తేరుకుని.. 2019 ఎన్నికలకు వివేకా సిద్ధమయ్యారని సునీతా రెడ్డి వెల్లడించారు.

YS Sharmila: బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు.. షర్మిల


2019 లో పార్టీ గెలుపు కోసం వైఎస్ వివేక విపరీతంగా కృషి చేశారన్నారు. పార్టీ కోసం పనిచేసిన కుటుంబ సభ్యులు షర్మిల, వివేకాకు జగన్ అన్యాయం చేశారన్నారు. జగన్‌ పాదయాత్రలో వివేకా అప్పుడప్పుడు కలిసేవారని సునీత అన్నారు. పార్టీ నిర్మాణానికి నిరంతరం సలహాలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారన్నారు. ఇదే సమయంలో షర్మిల పేరు మళ్లీ కడప సీటు కోసం చర్చకు వచ్చిందన్నారు. కడప ఆత్మీయ సమావేశాన్ని హైదరాబాద్‌లో షర్మిల నిర్వహించారన్నారు. కొన్ని రోజుల తర్వాత వివేకా కార్యకర్తల సమావేశం నిర్వహించారని సునీత వెల్లడించారు. ఆ తర్వాత పులివెందులలో వివేకా ఓటు జాబితాలోనే లేకుండా పోయిందని తెలిపారు.

TDP: నా..నా... అంటూనే ఆ వర్గాలపై వరుస దాడులు.. లోకేష్ ఫైర్


ప్రతిపక్షాలే ఓటు లేకుండా చేశాయని మేమంతా భావించామని సునీత తెలిపారు. వివేకాను వ్యతిరేకించేవారే ఓటు తొలగించారని అర్థమైందన్నారు. ఓటు తొలగింపుపై వివేకా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. షర్మిలను కడప నుంచి పోటీ చేయాలని వివేకా ఒత్తిడి చేశారని సునీత వెల్లడించారు. తనకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదని.. తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని సునీత పేర్కొన్నారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలు, బ్యూరో క్రాట్స్ కలిశానని.. ఇక మీదట కలుస్తానని వెల్లడించారు. ఎవరి పని వాళ్ళ చేస్తే తనకెలాంటి అభ్యంతరం లేదని.. తనకు ఫేవర్ చేయాలని కూడా కోరుకోవడం లేన్నారు. వివేకా కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని సునీత తెలిపారు.

AP News: టీడీపీలో చేరనున్న కరోనా మందు ఆనందయ్య

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Updated Date - Apr 06 , 2024 | 12:40 PM

Advertising
Advertising