ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Pension: మరీ ఇంతలానా!.. టీడీపీని బద్నాం చేసేందుకు వృద్ధులను వాడేసుకున్న వైసీపీ

ABN, Publish Date - Apr 03 , 2024 | 01:37 PM

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు (బుధవారం) గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లను పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. పెన్షన్లు పంపిణీ చేస్తున్నారన్న ప్రకటనతో ఉదయం నుంచే వృద్ధులు, వితంతువులు సచివాలయాలకు చేరుకుంటున్నారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వికలాంగులకు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నిబంధనలకు వైసీపీ తూట్లు పొడిచేందుకు యత్నిస్తోంది. కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులను మంచాలపై పడుకోబెట్టి సచివాలయాల వద్దకు వైసీపీ శ్రేణులు మోసుకెళ్తున్న దృశ్యాలు పలు ఛానళ్లలో ప్రసారం అయ్యాయి.

అమరావతి, ఏప్రిల్ 3: ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీపై అధికార వైసీపీ.. టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు (బుధవారం) గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లను పంపిణీ చేయాలని సర్కార్ (AP Government) నిర్ణయించిన సంగతి తెలిసిందే. పెన్షన్లు (AP Pensions) పంపిణీ చేస్తున్నారన్న ప్రకటనతో ఉదయం నుంచే వృద్ధులు, వితంతువులు సచివాలయాలకు బారులు తీరారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వికలాంగులకు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేయాలని ఎలక్షన్ కమిషన్ క్లియర్ కట్‌గా ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నిబంధనలకు వైసీపీ తూట్లు పొడిచి.. కొందరు మనుషులను పెట్టి మరీ.. కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులను మంచాలపై పడుకోబెట్టి సచివాలయాల వద్దకు తీసుకెళ్తుండటం సిగ్గుచేటు అని టీడీపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనను తెలుగుదేశం పార్టీ (TDP) సీరియస్‌గా తీసుకుంది.

ఈసీ ఏం చేస్తుందో..?

కదల్లేని వాళ్లకు ఇళ్ల వద్దే పెన్షన్ ఇవ్వాలనే నిబంధనలున్నా.. వైసీపీ నేతలు కావాలనే పబ్లిసిటీ కోసం వృద్ధులను ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ ఆరోపించింది. వైసీపీ నేతల అకృత్యాలపై ఈసీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. సోషల్ మీడియాలో టీడీపీ బద్నాం చేయడానికి వైసీపీనే కావాలని ఇలా చేసి.. వాటిని వీడియోలు తీస్తున్నారని ఈసీ దృష్టికి టీడీపీ తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఫిర్యాదు చేశాక.. ఈసీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

AP High Court: ఎన్నికలకు ముందుకు ఏపీ సర్కారుకు హైకోర్టులో ఊహించని షాక్

ప్రజల ఆగ్రహం

కాగా.. ఇవాళ ఉదయం నుంచి మొదలు కావాల్సిన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యం కావడంతో వృద్ధులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పెన్షన్ల కోసం ఉదయం నుంచే సచివాలయాలకు పెన్షన్‌దారులు చేరుకున్నారు. సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే డబ్బులు రాలేవని, మధ్యాహ్నం నుంచి పెన్షన్ పంపిణీ ప్రక్రియ మొదలువుతుందని సచివాలయం సిబ్బంది చెబుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచే పెన్షన్లను పంపిణీ చేస్తామని ఎందుకు చెప్పారంటూ పెన్షన్‌దారులు మండిపడుతున్నారు. చివరకు పెన్షన్ పంపిణీ లేకపోవడంతో ప్రజలు వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. ఈరోజు నుంచి ఈనెల 6వరకు నాలుగు రోజుల పాటు పెన్షన్ పంపిణీ జరుగనుంది.

ఇవి కూడా చదవండి..

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. కీలక నేత రాజీనామా

Hyderabad: ‘అయ్యో’మయం.. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‏లో గందరగోళం


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 03 , 2024 | 01:55 PM

Advertising
Advertising