ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gorantla: వివేకా హత్య కేసులో జగన్ పాత్రపై గోరంట్ల సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 02 , 2024 | 12:01 PM

Andhrapradesh: మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్ హత్య కేసులో ప్రమేయం ఉన్నందునే దర్యాప్తుకు ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యకు జరిగిన కుట్రలో కచ్చితంగా జగన్ పాత్ర ఉందని సంచలన కామెంట్స్ చేశారు.

రాజమండ్రి, మార్చి 2: మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు (Viveka Murder Case) సంబంధించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్ హత్య కేసులో ప్రమేయం ఉన్నందునే దర్యాప్తుకు ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యకు జరిగిన కుట్రలో కచ్చితంగా జగన్ (CM Jagan) పాత్ర ఉందని సంచలన కామెంట్స్ చేశారు. సొంత చెల్లెలకి న్యాయం చేయలేని వాడివి ప్రజలకు ఏం చేస్తావ్ అని నిలదీశారు.

Vasantha Krishna Prasad: టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌


వైఎస్సార్సీపీ అవినీతికి అంతేలేదు...

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ చేసే అవినీతి అక్రమాలకు అంతులేకుండా పోతోందని విమర్శలు గుప్పించారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని...‌ అధికార యంత్రాంగంతో రాజకీయ ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రి కేంద్రంగా ఇసుక మాఫియా ద్వారా రోజుకు రెండు కోట్లు దోచేస్తున్నారన్నారు. బ్యారేజ్ కింద ఇసుక మొత్తం తవ్వేస్తున్నారని.. బ్యారేజ్‌కు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని సాగనంపాలని అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

Hyderabad: నకిలీ మందుల ఫార్మా గుట్టు రట్టు.. రూ.7.34 లక్షల విలువైన టాబ్లెట్లు స్వాధీనం

TS News: మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్.. కాలేజ్‌ కోసం వేసిన రోడ్డును...


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 02 , 2024 | 12:06 PM

Advertising
Advertising