Andhra Pradesh: జగన్‌కు ఓటేస్తే ఏపీని హోల్‌సేల్‌గా అమ్మేస్తారు.. బుద్దా వెంకన్న
ABN, Publish Date - Mar 30 , 2024 | 03:07 PM
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు అధికార నేతలపై విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ లీడర్ బుద్దా వెంకన్న సీఎం జగన్ ( CM Jagan ) పై ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల తర్వాత వైసీపీకి తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు అధికార నేతలపై విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ లీడర్ బుద్దా వెంకన్న సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల తర్వాత వైసీపీ ( YCP ) కి తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని మండిపడ్డారు. చంద్రబాబుకు దైవశక్తి అనుకూలిస్తుందని.. చంద్రబాబు జైలుకెళ్తే చులకనగా మాట్లాడిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 39 సీట్లు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఇబ్బందులు పడుతోందని కానీ గత ఎన్నికల్లో 23 సీట్లు వచ్చిన తాము మాత్రం గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు పేదల ఆశీస్సులున్నాయి. జగన్ పేదల ద్రోహి. చంద్రబాబు తెచ్చిన అన్న క్యాంటీన్లను జగన్ రద్దు చేశారు. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లు పెట్టాం. కేవలం రూ. 5కే టిఫిన్, భోజనం పెట్టే క్యాంటీన్లు రద్దు చేశారు ప్రస్తుత సీఎం. పేదలకు చంద్రబాబు అన్నం పెడితే జగన్ కడుపు కాలుస్తున్నారు. ఆయనేమో రూ. 2 లక్షలు షర్ట్, రూ. 1 లక్ష చెప్పులు ఉపయోగిస్తారు. మరోసారి జగన్ కు ఓటేస్తే ఏపీని హోల్ సేల్ గా అమ్మేస్తారు. జగన్ తన పిల్లలను లండన్ లో చదివిస్తూ పేదల పిల్లలకు విదేశీ విద్యను దూరం చేశారు. జే-బ్రాండ్ల మద్యంతో సుమారు రూ.35 లక్షల మంది పేదల ఆరోగ్యం క్షీణించేలా చేశారు. నాసిరకం మద్యం తాగడం వల్ల 35 వేల మంది అభాగ్యులు చనిపోయారు. అలాంటి జగన్ పేదల గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం.
- బుద్దా వెంకన్న, టీడీపీ సీనియర్ లీడర్
KA Paul: నా సత్తా ఏంటో వైసీపీ నాయకులకి తెలియడం లేదు.. 7 రోజులు టైం ఇస్తున్నా..
అత్యంత ధనికురాలైన బుట్టా రేణుక పేద మనిషని జగన్ అబద్దాలు చెబుతున్నారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పేదరాలు అన్న జగన్ కు మతిపోయిందా అని ఎద్దేవా చేశారు. లేక జనానికి మతిపోయింది అనుకుని ఇలా మాట్లాడుతున్నారా అని ఆక్షేపించారు. పేదల ఇళ్లను తొలగించి జగన్ తన ఇంటికి రోడ్లేసుకున్నారని విమర్శించారు. పేదల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 30 , 2024 | 04:20 PM