AP Elections: అలాంటి వారి వల్ల పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది.. వర్ల రామయ్య..
ABN, Publish Date - Apr 12 , 2024 | 08:03 PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh ) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్టీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఒంగోలులో టీడీపీ నేతలపై దాడి అంశాలపై అదనపు సీఈఓ కు ఫిర్యాదు చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh ) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్టీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఒంగోలులో టీడీపీ నేతలపై దాడి అంశాలపై అదనపు సీఈఓ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో చాలామంది పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. పోలీసులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మార్పు రావడం లేదన్నారు. పోలీసులు మాన్యువల్ ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేకు పోలీసులు సెల్యూట్ చేయడం ప్రోటోకాల్ అవుతుంది కానీ ఎమ్మెల్యే కుమారుడు, భార్య, కుటుంబ సభ్యులకు సెల్యూట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కుమారుడి కారు డోరు సీఐ భక్తవత్సల్య రెడ్డి తీయడం ఏంటని నిలదీశారు. ఇలాంటి అధికారుల వల్లే పోలీసు వ్యవస్థ భ్రష్టుపడుతోందని ఫైర్ అయ్యారు.
BRS: నిరీక్షణకు తెర.. వరంగల్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసిన ఖరారు..
సీఐ భక్తవత్సల్య రెడ్డిపై ఫిర్యాదు చేశాం. ఎన్నికల విధులకు ఆయన అర్హుడు కాదు. జైలులో ఉన్నవారిపై కేసులు పెట్టారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై అదనపు సీఈఓకు ఫిర్యాదు చేశాం. పోలీసులపై ఫిర్యాదు చేద్దామంటే డీజీపీ అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఆయన సీఎంకు జవాబుదారీ కాదు. రాష్ట్ర ప్రజలందరికి జవాబుదారీ. పులివెందుల నుండి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న బీటెక్ రవికి గన్ మెన్ లు ఇవ్వాలని కోరితే ఇవ్వలేదు. ఆయన ప్రాణాలకు ముప్పు లేదని ఎస్పీ రిపోర్ట్ ఇచ్చారు. కానీ 38 కేసులు ఉన్న జగన్ పై పోటీ చేస్తున్న బీటెక్ రవికి భద్రత కల్పించకపోవడం ఎంత వరకు కరెక్ట్.
- వర్ల రామయ్య, టీడీపీ నేత
Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు.. అలా చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్..
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ లీడర్ దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. బందరులో పేర్ని నాని, కిట్టు విధ్వంసంపై సరైన కేసులు నమోదు చేసి ఉంటే ఒంగోలులో ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. సెర్ప్ సీఈఓగా మురళీధర్ రెడ్డి అనర్హుడని పైర్ అయ్యారు. లోకేశ్ ఐ ఫోన్ ట్యాపింగ్ కు గురయిందన్నారు. డీజీపీ ,ఇంటెలిజెన్స్ డీజీ అధికారాన్ని దుర్వినియోగపరిచి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
Updated Date - Apr 12 , 2024 | 08:03 PM