ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam : ఏటీఎంల్లో భారీ చోరీ

ABN, Publish Date - Aug 19 , 2024 | 04:37 AM

విశాఖలో కొందరు ఆగంతకులు రెండు ఎస్‌బీఐ ఏటీఎంలను కొల్లగొట్టి పోలీసులకు సవాల్‌ విసిరారు. పెందుర్తి, తగరపువలసలో రెండు చోట్ల కలిపి మొత్తం రూ.33లక్షలు అపహరించుకుపోయారు.

  • 2 ఏటీఎంల నుంచి రూ.33 లక్షలు అపహరణ

  • విశాఖలో పోలీసులకు సవాల్‌ విసిరిన ఆగంతకులు

  • పెందుర్తి, తగరపువలస ఎస్‌బీఐ ఏటీఎంల్లో ఘటనలు

  • వైర్లు కత్తిరించి, గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంల బ్రేక్‌

  • సీసీ కెమెరాలపై బ్లాక్‌ పెయింట్‌ స్ర్పే

  • ఆధారాలు దొరక్కుండా సీసీ ఫుటేజ్‌ బాక్స్‌ అపహరణ

  • కారులో వచ్చి దర్జాగా దొంగతనం

  • అంతర్రాష్ట్ర ముఠా పనేనంటున్న పోలీసులు

పెందుర్తి, భీమునిపట్నం (రూరల్‌), ఆగస్టు 18: విశాఖలో కొందరు ఆగంతకులు రెండు ఎస్‌బీఐ ఏటీఎంలను కొల్లగొట్టి పోలీసులకు సవాల్‌ విసిరారు. పెందుర్తి, తగరపువలసలో రెండు చోట్ల కలిపి మొత్తం రూ.33లక్షలు అపహరించుకుపోయారు.

పోలీసుల కథనం మేరకు శనివారం అర్ధరాత్రి దాటాక.. ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల సమయంలో.. ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించిన ఆగంతకులు ఓ కారులో పెందుర్తి నటరాజ్‌ థియేటర్‌ సమీపంలోని ఓ కాంప్లెక్స్‌లోగల ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రం వద్దకు వచ్చారు.

ఏటీఎంలో చొరబడి అక్కడ రెండు వైపులా ఉన్న సీసీ కెమెరాల్లో తమ చిత్రాలు రికార్డు కాకుండా వాటిపై బ్లాక్‌ పెయింట్‌ స్ర్పే చేశారు. తొలుత ఏటీఎంకు ఉన్న విద్యుత్‌ తీగలను కత్తిరించారు.

తర్వాత గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి ఏటీఎంలో ఉన్న రూ.19 లక్షల నగదును దోచుకుని పారిపోయారు. ఎలాంటి ఆధారాలూ దొరకనీయకుండా సీసీ టీవీ ఫుటేజీ రికార్డయ్యే డీవీఆర్‌ బాక్స్‌, విడి భాగాలను కూడా తొలగించి తమతో పాటు తీసుకుని, దర్జాగా కారులో పరారయ్యారు.

అనంతరం, భీమిలి మండలం తగరపువలస సమీపంలోని అవంతి కళాశాల వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎంను ఆగంతుకులు కొల్లగొట్టి అందులో ఉన్న రూ.14.40 లక్షలు చోరీ చేశారు.


గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని కట్‌ చేసి, నోట్ల కట్టలను ఎత్తుకుపోయినట్టు తెలుస్తోంది. ఈ సమీపంలో హోటళ్లు, పలు దుకాణ సముదాయాలు రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటాయని, వారి నుంచి కూడా సమాచారాన్ని రాబడుతున్నామని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఆరా తీస్తున్నామన్నారు. చోరీలో ముగ్గురు పాల్గొన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.


కెమెరా పనిచేయకపోవంతో వెలుగులోకి...

కాగా, ఎస్‌బీఏ నిర్వహణలోని సెక్యూరిటీ కమాండ్‌ కంట్రోల్‌ చెక్‌అ్‌పలో పెందుర్తిలోని ఏటీఎం సీసీ కెమెరా ఎర్రర్‌గా చూపిస్తుండడాన్ని సిబ్బంది గుర్తించి, వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించడంతో చోరీ విషయం బయటపడింది.

దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. క్రైమ్‌ డీసీపీ వెంకటరత్నం, ఏసీపీ శ్యామలరావు, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సూరిబాబు స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే ఆగంతకులు పలురకాల జాగ్రత్తలు తీసుకోవడంతో ఎటువంటి ఆధారాలూ లభ్యం కాలేదని సమాచారం.


ఈ క్రమంలో ఏటీఎం సమీపంలోని భవనాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా ముఖాలకు మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించిన నలుగురైదుగురు ఆగంతకులు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు.

జాతీయ రహదారుల వెంబడి ఉన్న ఏటీఎంలను టార్గెట్‌ చేసుకుని జరిగిన చోరీలను బట్టి, ఇది అంతర్రాష్ట్ర ముఠాల పనిగానే భావిస్తున్నామని డీసీపీ వెంకటరత్నం తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు క్రైమ్‌ ఏసీపీ శ్యామలరావు తెలిపారు.

Updated Date - Aug 19 , 2024 | 04:37 AM

Advertising
Advertising
<