ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakha: రెచ్చిపోయిన కామాంధుడు.. భీమిలిలో మరో దారుణ ఘటన..

ABN, Publish Date - Sep 21 , 2024 | 08:19 AM

భీమిలి పట్టణానికి చెందిన ఓ బాలుడు గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించినప్పటికీ రోజూ వెంటపడేవారు. అయితే ఇదే క్రమంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించి అత్యాచారం చేశాడు.

విశాఖ: మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితుడు పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసి హతమార్చాడు. దీంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వచ్చాయి. అయినప్పటికీ ప్రతి రోజూ ఏదో ఓ మూలన మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ తనను పలుమార్లు అత్యాచారం చేశాడంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన చెప్తున్నారు.


తాజాగా అలాంటి ఘటనే ఒకటి భీమిలిలో వెలుగు చూసింది. పట్టణానికి చెందిన ఓ బాలుడు గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించినప్పటికీ రోజూ వెంటపడేవారు. అయితే ఇదే క్రమంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన నిందితుడు.. ఆమెపై దారుణానికి ఒడికట్టాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బలవంతంగా ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు. తల్లి పని నుంచి ఇంటి వచ్చిన తర్వాత బాలిక విషయాన్ని ఆమెకు తెలియజేసింది. దీంతో బాధితులు భీమిలి పోలీసులను ఆశ్రయించారు. ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం అతణ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.


ఇటీవల ఏలూరు జిల్లాలో హాస్టల్ విద్యార్థినిలపై వార్డెన్ అత్యాచారం చేసిన ఘటన సైతం సంచలనం సృష్టించింది. ఏలూరులోని ఓ ఆశ్రమ పాఠశాల వసతి గృహం వార్డెన్ బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్‌(56) ఫొటో గ్రఫీ పేరుతో ఈనెల 15న ఇద్దరు 8వ తరగతి విద్యార్థినిలను కారులో తీసుకెళ్లాడు. బాపట్ల తీసుకువెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు, తోటి విద్యార్థులకు చెప్పడంతో ఏలూరు టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శశికుమార్‌, అతని భార్య ఫణిశ్రీ, కేర్‌ టేకర్‌ లావణ్యలను అరెస్టు చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్‌ చెప్పారు.


ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ వెలుగు చూస్తుండడంతో అసలు మహిళలకు దేశంలో రక్షణ ఉందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడే వారిని మరింత కఠినంగా శిక్షించాలని అప్పుడే నేరాలకు పాల్పడే వారిలో భయం కలుగుతుందని పలు ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 08:19 AM