Botsa Satyanarayana: తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి.. బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Aug 31 , 2024 | 06:52 PM
కలుషిత ఆహారం తిని, పిల్లలు, అస్వస్థతకు గురవుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రెండు నెలల్లో పది ఘటనలు జరిగాయని గుర్తుచేశారు.ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు.
విశాఖపట్నం: కలుషిత ఆహారం తిని, పిల్లలు, అస్వస్థతకు గురవుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రెండు నెలల్లో పది ఘటనలు జరిగాయని గుర్తుచేశారు.ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. సంబంధిత అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం పిల్లల విషయంలో సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని మండిపడ్డారు.ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినులు సీసీ కెమెరాలు పెట్టారని, ఆరోపిస్తుంటే దీనిపైన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి.. పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యం ఇచ్చామని.. తెలుగు మీడియం తీసివేయలేదని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అమ్మఒడి పైసలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో నాడు - నేడులో అనేక పనులు చేపట్టామని తెలిపారు. మిగిలిన పనులు కూడా ఈ ప్రభుత్వం చేయాలని కోరారు.
విద్య మీద ఖర్చుపెట్టి ప్రతి పైసా కూడా రేపు భవిష్యత్తు కోసమేనని చెప్పారు. ఫార్మా క్షతగాత్రులకు, పార్టీ తరపున, ప్రకటించిన పరిహారం రెండు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల అస్వస్థతపై కఠినమైన చర్యలు తీసుకొని, ఒక ఎస్ఓపీని అమలు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Updated Date - Aug 31 , 2024 | 06:54 PM