CM Chandrababu: మంత్రి రాం ప్రసాద్ రెడ్డి భార్య తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి
ABN, Publish Date - Jul 01 , 2024 | 09:01 PM
ఏపీ పోలీసులపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy) సతీమణి హుకుం జారీ చేశారు. తన వెంట స్థానిక ఎస్‌ఐ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్‌లో పోలీసులపై జులుం ప్రదర్శించారు.
కడప: ఏపీ పోలీసులపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy) సతీమణి హుకుం జారీ చేశారు. తన వెంట స్థానిక ఎస్‌ఐ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్‌లో పోలీసులపై జులుం ప్రదర్శించారు. మంత్రి భార్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోలీసులతో మంత్రి భార్య హరితా రెడ్డి మాట్లాడిన తీరును సీఎం తప్పుపట్టారు. ఈ ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో ఫోన్‌లో మాట్లాడి వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా మసలుకోవాలని... ఇలాంటి వైఖరిని సహించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై మంత్రి రాం ప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని ముఖ్యమంత్రికి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Ram Prasad : త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
CM Chandrababu: మంత్రి రాం ప్రసాద్ రెడ్డి భార్య తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి
Read Latest AP News AND Telugu News
Updated Date - Jul 01 , 2024 | 09:38 PM