Ganta Srinivasa Rao: ఆ వైసీపీ నేతలు రాజీనామా చేయాలి.. గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jun 22 , 2024 | 06:27 PM
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పైన, గత వైసీపీ ప్రభుత్వ పెద్దలకు కన్ను పడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. విశాఖలో వ్యాపారాల పైన గత వైసీపీ ప్రభుత్వం దృష్టిపడిందన్నారు. సినిమాల్లో సంబంధం లేని వాళ్లు కూడా ఈ క్లబ్లో రాజకీయంగా ఇందులో చొరబడ్డారని ఆరోపించారు.
విశాఖపట్నం: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పైన, గత వైసీపీ ప్రభుత్వ పెద్దలకు కన్ను పడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. విశాఖలో వ్యాపారాల పైన గత వైసీపీ ప్రభుత్వం దృష్టిపడిందన్నారు. సినిమాల్లో సంబంధం లేని వాళ్లు కూడా ఈ క్లబ్లో రాజకీయంగా ఇందులో చొరబడ్డారని ఆరోపించారు. ఈ క్లబ్లో ఉన్న పదవులు అన్ని బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు. ఇందులో ఉన్న వైసీపీ నేతలు రాజీనామాలు చేసి తప్పుకోవాలని కోరారు. సినిమా రంగంలో సంబంధం ఉన్న వ్యక్తులకు తిరిగి అవకాశం ఇవ్వాలన్నారు. లేదంటే ప్రభుత్వపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు ఉంటాయని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
సినీ రంగం అభివృద్ధి చెందాలి: కె ఎస్. రామారావు
2015లో ఫిలింనగర్ క్లబ్ ఏర్పాటు చేశామని సినీ నిర్మాత కె ఎస్. రామారావు తెలిపారు. గత కొంతకాలంగా ఫిలింకి సంబంధం లేని స్థానికులు సంఖ్య పెరుగుతూ వస్తుందని అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీస్ కి ఈ కమిటీ పూర్తిగా, అప్పగించాలని కోరారు. 2019లో రామానాయుడు కొండపైన ఐదు ఎకరాల కేటాయించారని గుర్తుచేశారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ , సినీ రంగం కూడా ఇక్కడ అభివృద్ధి చెందాలని కె ఎస్. రామారావు కోరారు.
Updated Date - Jun 22 , 2024 | 06:27 PM