ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Lokesh: క్షమించండి.. ఆ ఖర్చు నేనే భరిస్తా: మంత్రి లోకేశ్..

ABN, Publish Date - Sep 25 , 2024 | 02:50 PM

మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదవశాత్తూ మరో కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇద్దరి వాహనాల డ్రైవర్లకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

AP Minister Nara Lokesh

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. విశాఖ సమీపంలోని తాటిచెట్లపాలెం వద్ద మంత్రి కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదవశాత్తూ మరో కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇద్దరి వాహనాల డ్రైవర్లకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తన కారును మంత్రి కాన్వాయ్ ఢీకొట్టిందని వాహన యజమాని కల్యాణ్ భరద్వాజ్ తెలుసుకున్నారు. దీంతో ప్రమాదంలో తన వాహనం దెబ్బతిందన్న విషయాన్ని మంత్రి లోకేశ్‌కు బాధితుడు ట్విటర్ ద్వారా తెలియజేశాడు.


ప్రమాదానికి సంబంధించిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "జరిగిన ప్రమాదానికి క్షమాపణ చెబుతున్నా. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని నా భద్రతా సిబ్బందిని ఆదేశిస్తా. అలాగే మీ వాహన డ్యామేజీకి అయ్యే ఖర్చును భరిస్తా' అని రిప్లై ఇచ్చారు. మంత్రి నారా లోకేశ్ స్పందించిన తీరుపై టీడీపీ అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి స్థాయిలో ఉన్నా ఎలాంటి అహంకారం ప్రదర్శించుకుండా తన సిబ్బంది వల్ల జరిగిన ప్రమాదానికి కూడా ఆయన క్షమాపణ కోరారని ప్రశంసిస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులపై చిన్న విమర్శ చేసినా దాడులు చేశారని.. ఎన్డీయే ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.


స్టీల్ ప్లాంట్ బాధ్యత మాదే..

మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే ఉన్నామని ఆయన అన్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారని మంత్రి చెప్పారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇవాళ (బుధవారం) విశాఖలో నిర్వహించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమి‌ట్‌లో లోకేశ్ పాల్గొని ప్రసంగించారు. స్టీల్‌ప్లాంట్‌పై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. ఐదేళ్ల విధ్వంస పాలన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకంతోనే వారు వస్తున్నట్లు ఆయన చెప్పారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు ఇబ్బందుల్ని తెలుసుకొని పరిష్కరిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంకి ఎప్పుడూ తమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

CM Chandrababu: పార్వతమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

AP Highcourt: ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలను నిలిపివేయండి.. హైకోర్ట్ ఆర్డర్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2024 | 09:53 PM