ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lokesh: ఏ కొండో నిర్ణయించు... చంద్రబాబు, జగన్ పోటీ పడితే ఎవరొస్తారో తేల్చుదాం రా!

ABN, Publish Date - Feb 20 , 2024 | 01:54 PM

Andhrapradesh: ‘‘శంఖారావం’’ సభల్లో టీడీపీ యువనేత నారా లోకేష్ జోష్ అంతా ఇంతా కాదు. అధికారపార్టీపై విరుచుకుపడుతూ, జగన్ ప్రభుత్వం పాలనపై విమర్శలు గుప్పిస్తూ ముందు సాగుతున్నారు. తాజాగా మాడుగుల నియోజకవర్గం ‘‘శంఖారావం’’ సభలోనూ సీఎం జగన్‌పై లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 20: ‘‘శంఖారావం’’ సభల్లో (Shakaravam Sabha) టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) జోష్ అంతా ఇంతా కాదు. అధికారపార్టీపై విరుచుకుపడుతూ, జగన్ ప్రభుత్వం (Jagan Government) పాలనపై విమర్శలు గుప్పిస్తూ ముందు సాగుతున్నారు. తాజాగా మాడుగుల నియోజకవర్గం ‘‘శంఖారావం’’ సభలోనూ సీఎం జగన్‌పై (CM Jagan) లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వయస్సు ఉన్న వ్యక్తిని ముసలోడు అని హేళన చేస్తున్నారన్నారు. మాట్లాడితే ముసలోడు అంటూ విమర్శిస్తున్నారన్నారు.

జగన్ బస్ దిగాలి అంటే స్టూల్ వేయాలని.. కొబ్బరికాయ కొట్టాలి అంటే ఇద్దరు మనుషులు ఎత్తాలని ఎద్దేవా చేశారు. తిరుపతి కొండ, దుర్గమ్మ కొండ అయినా సరే.. ఏ కొండో నిర్ణయించు... చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), జగన్ పోటీ పడితే ముందు ఎవ్వరు వస్తారో చూడు అంటూ సవాల్ విసిరారు. జగన్ పొద్దున్న లేస్తే బూతులు వింటున్నారని.. పైగా మంత్రులను, కలెక్టర్లను బూతులు తిట్టమంటున్నారని మండిపడ్డారు. సన్న బియ్యం సన్నాసికి కొడాలి నానికి రత్న అవార్డ్ ఇచ్చారన్నారు. 10 క్లాస్‌లో పేపర్లు దొంగలాడారని... జగన్ ఒక కంత్రీ అంటూ కామెంట్స్ చేశారు. జగన్ పేద అరుపులు అరుస్తున్నారని... లక్ష కోట్లు ఆస్తి ఉన్న పేదవాడు, సొంత కంపెనీలు, ప్యాలెస్ ఉన్న పేదవాడు అంటూ యువనేత సెటైర్స్ విసిరారు.

అందుకే కోడిగుడ్డు బహుమతిగా ఇచ్చా...

జగన్ ఒక శాపం ఉంది..అందుకే ఎప్పుడూ నిజాలు చెప్పరన్నారు. జగన్ అహంకారానికి... ప్రజల ఆత్మ గౌరవానికి యుద్ధం వచ్చే ఎన్నికల్లో జరుగుతుందన్నారు. తనది అంబేడ్కర్ రాజ్యాంగమని... జగన్ ది రాజా రెడ్డి రాజ్యాంగమన్నారు. టీడీపీ హయాంలో తాము కంపెనీలు తీస్తే... ఆయన నాసిరకం మద్యం తెచ్చారన్నారు. బాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారన్నారు. ఉమ్మడి విశాఖ పాదయాత్రలో ఇచ్చిన ఏ హామీ జగన్ ఏమీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కోడి గుడ్డు మంత్రి దెబ్బకు పరిశ్రమలు వెళ్లిపోయాయని.. ఒక్క ఐటీ కంపెనీ కొత్తగా రాలేదన్నారు. ప్రపంచ స్థాయిలో ఆంధ్రా పరువు తీసేందుకు.. కోడి గుడ్డు మంత్రికి కోడి గుడ్డును బహుమతిగా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.

వారికే నామినేటెడ్ పదవులు..

‘‘మాడుగుల హల్వా నాకు ఇష్టం. మాడుగుల నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి ఉన్నా అభివృద్ధి లేదు.. అవినీతి ఉంది. ఈ నియోజకవర్గంలో అసలు రోడ్లు బాగోలేదు. బూడి ముత్యాల నాయుడు లంచాలు తీసుకున్నారు. వైసీపీ ఆపిన సంక్షేమ పథకాలను... మేము అధికారంలో వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం. 2019 నుంచి ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటే.. వారికి నామినేటెడ్ పదవులను ఇస్తాం’’ అని లోకేష్ పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 20 , 2024 | 01:54 PM

Advertising
Advertising