AP Politics: మంత్రి అమర్నాధ్కు అందుకనే టికెట్ ఇవ్వలేదు: జనసేన నేత
ABN , Publish Date - Feb 05 , 2024 | 03:25 PM
ఏపీలో అత్యంత అవినీతిపరుడు మంత్రి గుడివాడ అమర్నాధ్ అని జనసేన నేత పీతల మూర్తి యాదవ్(Peethala Murthy Yadav) ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అమర్నాధ్కు అసెంబ్లీ టికెట్ రాదని తెలిసి సీఎం జగన్(CM Jagan)ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు.
విశాఖపట్నం: ఏపీలో అత్యంత అవినీతిపరుడు మంత్రి గుడివాడ అమర్నాధ్ అని జనసేన నేత పీతల మూర్తి యాదవ్(Peethala Murthy Yadav) ఆరోపించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అమర్నాధ్కు అసెంబ్లీ టికెట్ రాదని తెలిసి సీఎం జగన్(CM Jagan)ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు. విసన్నపేటలో 600 ఎకరాల భూమిని అమర్నాథ్ & కో దోచుకున్నారని విమర్శించారు.
అమర్నాధ్ ఒక ప్యాకేజీ స్టార్...ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడు... అతని ఆస్తి రూ.5 కోట్లని.. ప్రస్తుతం ఆయన ఆస్తి రూ.500 కోట్లు పైమాటే అని అన్నారు. వైసీపీ నేతలే అమర్నాధ్ దోపిడీలపై జగన్కు ఫిర్యాదు చేశారని.. అందుకే అతన్ని జగన్ పక్కన పెట్టారని చెప్పారు. జనసేన టికెట్లు ప్రకటించమని అడగడానికి ఆయనెవరు..? అని ప్రశ్నించారు. అమర్నాధ్, ఆయన అనుచరుడు బొడ్డెటి ప్రసాద్ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమర్నాధ్ & కో దోపిడీలపై జనసేన న్యాయపోరాటం చేస్తుందని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..